Bigg Boss 9 Telugu Ritu Chaudhary Love Track: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ మొన్నటి వరకు బాగానే సాగింది. కానీ నిన్నటి నుండి మాత్రం రోత లవ్ ట్రాక్ వైపు నడవబోతుంది అని స్పష్టంగా అర్థం అవుతుంది. ముఖ్యంగా రీతూ చౌదరి ని బిగ్ బాస్ టీం లవ్ ట్రాక్ కోసం బాగా వాడుకునేలా ఉన్నారు. ఈమె మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నామినేషన్స్ సమయం లో, అదే విధంగా ఎన్నో సందర్భాల్లో మనకి అనిపించింది. కానీ ఈమెని తప్పు ట్రాక్ లోకి తీసుకెళ్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిన్న డిమోన్ పవన్ మరియు పవన్ కళ్యాణ్ లతో ఈమె నడిపిన పులిహోర ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ముందుగా పవన్ కళ్యాణ్ పై అలుగుతుంది. ఆయనేమో ఒక లవర్ ని బ్రతిమిలాడినట్టు బ్రతిమిలాడుతున్నాడు. అది చూసి డిమోన్ పవన్ అసూయ పడి అక్కడి నుండి లేచి వెళ్లిపోవడం వంటివి చూసి వామ్మో వీళ్లేంటి ఇలా ఉన్నారు అనిపించింది.
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
ముఖ్యంగా డిమోన్ పవన్ అయితే ఈ సంఘటన జరిగిన కాసేపటి తర్వాత ఒక లవర్ తో ఎలా అయితే మాట్లాడుతారో, అలాగే రీతూ చౌదరి తో కూడా మాట్లాడాడు. ఆమె వైపు నుండి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆమె లవర్ ని అడిగినట్టు ఇతన్ని చాక్లెట్ అడగడం, దాని కోసం ఆయన కెప్టెన్ సంజన దగ్గరకు వెళ్లి చాక్లెట్ అడగడం, దానికి ఆమె వదినకి ఇవ్వాలని అనుకుంటున్నావా, సరే వెళ్లి ఇవ్వు రా అని అనడం, దానికి ఈయన సిగ్గు పడడం, అబ్బో..ఎందుకులే..రీతూ చౌదరి తో ఆయన లవ్ ట్రాక్ నడపడం కాదు, పరిగెత్తిస్తున్నాడు. రీతూ ఉండే టెనెంట్స్ రూమ్ కి వెళ్లి, ఎవరికీ తెలియకుండా చాక్లెట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆమె సగం తిని, ఇతనికి సగం ఇవ్వడం వంటివి చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.
నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కానీ దానిని ఎపిసోడ్ లో కేవలం 5 నిమిషాలు మాత్రమే చూపిస్తే. వీళ్ళ మధ్య నడిచిన సోది లవ్ ట్రాక్ ని అరగంటకు పైగా చూపించారు. రీతూ చౌదరి విష్ణు ప్రియా కి బెస్ట్ ఫ్రెండ్. ఈమె కూడా ఆమె స్నేహితురాలి లాగా పులిహోర కలిపే బ్యాచ్ అని అంతా అనుకున్నారు. కానీ ఈమె పరిణీతి చెందిన ప్రవర్తన తో హౌస్ లో నడుచుకోవడాన్ని చూసి, పర్లేదు, మంచి కంటెస్టెంట్ అని మొన్నటి వరకు ఆడియన్స్ లో మంచి అభిప్రాయం ఉండేది. కానీ నిన్నటి ఎపిసోడ్ తో ఆ అభిప్రాయాన్ని తుడిచిపెట్టేసింది రీతూ చౌదరి. రాబోయే రోజుల్లో అయినా ఈ లవ్ ట్రాక్ ని పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ పెడుతుందో లేదో చూడాలి.