Bigg Boss 9 Telugu Tanuja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో ప్రస్తుతానికి టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ తనూజ. ఈమె ఇతర కంటెస్టెంట్స్ తో పోలిస్తే టాస్కులు గెలిచినవి చాలా తక్కువ, అవకాశాలు వచ్చినప్పుడు తన నుండి నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ అయితే బలంగా పెట్టింది కానీ, ఉన్న అందరిలోకి చాలా వీక్ అని అనిపించుకుంది. అంతే కాదు ప్రతీ విషయం లోనూ ఎమోషనల్ అయిపోవడం చూసే వాళ్లకు సీరియల్ యాక్టింగ్ లాగా అనిపించేది. నిన్న కెప్టెన్సీ టాస్క్ లో ఈమె ఓడిపోయినందుకు వెక్కి వెక్కి ఏడ్చింది, హౌస్ లో తనకు ఎవ్వరూ లేరని అనుకుంది. కానీ హౌస్ లో కంటెస్టెంట్స్ చేత ఇప్పటి వరకు ఈమెకు దొరికినంత సపోర్ట్ ఏ కంటెస్టెంట్ కి కూడా దొరకలేదు. కానీ నిన్న మాత్రం నాన్న అని పిలిచే భరణి, క్లోజ్ ఫ్రెండ్ గా భావించే ఇమ్మానుయేల్, సుమన్ వంటి వారు కూడా తనూజ కి సపోర్ట్ గా నిలబడలేదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రీ ఎంట్రీ ఇచ్చిన భరణి, శాశ్వత హౌస్ మేట్ గా మారిన తర్వాత బిగ్ బాస్ ఆయనకు కెప్టెన్సీ టాస్క్ కి కంటెండర్స్ ని ఎంపిక చేసే అవకాశాన్ని ఇస్తాడు. అప్పుడు భరణి తనకు సపోర్ట్ చేసిన తనూజ, దివ్య, నిఖిల్, సాయి మరియు తనని కెప్టెన్సీ కంటెండర్లు గా ప్రకటిస్తాడు. ఇక్కడే ఆయన వెర్షన్ లో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వీళ్లంతా తనకు సపోర్టు చేశారు, రెండు వీళ్లంతా ఇప్పటి వరకు హౌస్ లో కెప్టెన్స్ అవ్వలేదు. చాలా న్యాయమైన నిర్ణయం తీసుకున్నాడు. కానీ సాయి భరణి కి బలంగా సపోర్టు ఇవ్వలేదు. కాసేపు భరణి కి సపోర్టు చేసి, కాసేపు శ్రీజ కి సపోర్ట్ చేసాడు. భరణి కి రీతూ చౌదరి లేదా మాధురి లలో ఎవరో ఒకరికి ఇద్దామని ఉంది, అందుకే ఆయన సాయి వద్దకు వచ్చి, ఈ ఒక్కసారికి ఆగిపోతావా అని అడుగుతాడు.
నాకు మొదటి నుండి ఇమ్మ్యూనిటీ ఉందని అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారు. ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి అని అంటాడు. ఇక భరణి కూడా ఏమి చెప్పలేక సరే అని అంటాడు. ఇక కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మొదటి రౌండ్ లో తనూజ కి అందరూ సపోర్ట్ చేశారు. రెండవ స్థానం లో దివ్య, మూడవ స్థానం లో భరణి నిలిచారు. ఇక దివ్య, తనూజ మధ్య చివరి రౌండ్ జరుగుతుంది. ఈ రౌండ్ లో దివ్య గెలిచి ఇంటికి కెప్టెన్ అవుతుంది. భరణి అటు దివ్య కి పూర్తిగా సపోర్టు చేయలేక, ఇటు తనూజ కి చేయలేక మధ్యలో ఆగిపోయాడు. తనూజ కి దివ్య నాకోసం టాస్కు ఆడి గెలిపించింది కదమ్మా?, ఆమెకి సపోర్ట్ చెయ్యాలని అనుకుంటున్నాను అని చెప్పడానికి వచ్చాడు, కానీ తనూజ నన్ను ఆడనిచ్చి ఉండుంటే నేను కూడా ఆడేదానిని నాన్న అని అంటుంది, ఇంతలోపే టాస్క్ పూర్తి అవుతుంది.
ఇక్కడ తనూజ కి భరణి సపోర్టుగా రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. కానీ ఇమ్మానుయేల్, సుమన్ వంటి వారు సపోర్టుగా రాకపోవడానికి ఆమె యాటిట్యూడ్ నే కారణం అని చెప్పొచ్చు. ఇమ్మానుయేల్ మొదటి నుండి ఆమెకు సపోర్టుగా ఉంటూ వస్తున్నది వాస్తవం, అందులో ఎలాంటి సందేహం లేదు, అలాంటి ఇమ్మానుయేల్ ని నువ్వు నాకు ఎలాంటి సపోర్టు చేయలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక అప్పటి నుండి ఈమెకు ఎంత చేసినా ఉపయోగం లేదు అని అనిపించి సపోర్టు చేయడం మానేసాడు. అంతే కాకుండా ప్రతీ చిన్న విషయానికి హౌస్ మేట్స్ పై అరుస్తూ, చిరాకు పడుతూ ఉంటుంది తనూజ, ఇది కూడా ఆమెకు పెద్ద మైనస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కూడా అయిష్టంగానే తనూజ కి సపోర్ట్ చేసాడు కానీ, ఇష్టపూర్వకంగా మాత్రం చేయలేదు. నిన్నటి ఎపిసోడ్ తనూజ కి కాస్త సానుభూతిని కలిగించొచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే తన కోపమే తన శత్రువు అనే విషయం అర్థం అవుతుంది.