Bigg Boss 9 Telugu Demon Pawan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోని పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఎవ్వరూ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు చూసే వాళ్లకు కొంతమంది థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించగా, మరికొంతమందికి స్క్రిప్ట్ ప్రకారం నడిపిస్తున్నట్టుగా అనిపించింది. ఇలా ఇప్పటి వరకు ఏ సీజన్ కి జరగలేదు. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మాధురి ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. తనూజ దగ్గర సేవింగ్ పవర్ ఉన్నప్పటికీ, ఆమె ఆడియన్స్ ఓటింగ్ ని బట్టే ఉంటానని, వాళ్ళు నాకు ఓటు వెయ్యకపోతే వెళ్లిపోతానని చెప్పిందట. నామినేషన్స్ లో అందరికంటే ఆమెకే తక్కువ ఓటింగ్ వచ్చింది కాబట్టి, ఆమెనే ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కానుంది. ఇదంతా పక్కన పెడితే నిన్న డిమోన్ పవన్ కి నాగార్జున ఏ రేంజ్ వార్నింగ్ ఇచ్చాడో మన అందరికీ తెలిసిందే.
రీతూ చౌదరి తో గొడవ పడుతూ, ఆమెని బెడ్ మీదకు రెండు మూడు సార్లు నెట్టి వేయడం పై నాగార్జున ఫైర్ అయ్యాడు. రీతూ, డిమోన్ మధ్య ఉన్న ర్యాపో కి అవన్నీ మామూలే అయినప్పటికీ, చూసే ఆడియన్స్ కి మాత్రం బ్యాడ్ సిగ్నల్ వెళ్తుందని, షో పరువు పోతుందని నాగార్జున మండిపడ్డాడు. దాదాపుగా బయటకు గెంటేయడానికే ఫిక్స్ అయిపోయారు, కానీ చివర్లో హౌస్ మేట్స్ అందరూ సపోర్టుగా నిలబడడం తో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఆడియన్స్ కి ఇంత చిన్న విషయానికి అంత పెద్దది చేయడం అవసరమా?, ఆ అమ్మాయి కి లేని ఇబ్బంది నాగార్జున కి ఎందుకు అంటూ డిమోన్ పవన్ పై జాలి చూపించారు. కుర్రాడు మొదటి నుండి ఫిజికల్ టాస్కుల్లో అద్భుతంగా ఆడుతున్నాడు, అందరితో ఎంతో చక్కగా ప్రవర్తిస్తాడు, మంచి అబ్బాయి అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అందువల్ల డిమోన్ పవన్ కి టాప్ రేంజ్ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వచ్చే వారం ఆయన నామినేషన్స్ లోకి వస్తే,ఓటింగ్ విషయం లో పవన్ కళ్యాణ్ ని కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రీతూ చౌదరి కూడా నిన్నటి ఎపిసోడ్ తో టాప్ 5 లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని చెప్పొచ్చు. ఈ అమ్మాయి ఇంత మంచిదా అని ఈ షో ని చూసే ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు. నెగటివ్ ఇమేజ్ తో హౌస్ లోపలకు అడుగుపెట్టిన రీతూ చౌదరి, ఒకే ఒక్క ఎపిసోడ్ తో తన క్యారక్టర్ ఏంటో చూపించి, పూర్తిగా పాజిటివ్ ఇమేజ్ ని సొంతం చేసుకుందని, ఇదే తరహాలో ఆమె తన ఆట తీరుని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే మాత్రం కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ జంట నిన్నటి ఎపిసోడ్ తో ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పొచ్చు.