Bigg Boss 9 Telugu Pawan Kalyan: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) కాసేపటి క్రితమే మొదలైంది. మొదటి కంటెస్టెంట్ గా సీరియల్స్ హీరోయిన్ తనూజ వెళ్లగా, రెండవ కంటెస్టెంట్ గా ఫ్లోరా షైనీ వెళ్ళింది. ఈ ఇద్దరి తర్వాత అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ లోని 13 మందిలో ఒకరిని నాగార్జున చేతుల మీద రివీల్ చేస్తూ ఆర్మీ పవన్ కళ్యాణ్ ని హౌస్ లోపలకు పంపారు. ‘అగ్నిపరీక్ష’ షో మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షించిన కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్. టాస్కులు అద్భుతంగా ఆడడమే కాకుండా, చాలా తెలివి గా మాట్లాడుతూ, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా సింపుల్ గా ఉండడం తో అందరికీ తెగ నచ్చేసాడు. ఈయన ‘ఆపరేషన్ సింధూర్’ సమయం లో శత్రు మూకలతో పోరాడాడు అట కూడా. దేశం కోసం ప్రాణాలకు తెగించివాడు ఇలాంటి ఆట లోకి రావడం చరిత్ర లో ఇదే తొలిసారి.
ఇతను విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే ఇతనికి నాగార్జున ఒక అగ్నిపరీక్ష పెడుతాడు. హౌస్ లో ఉన్నటువంటి తనూజ మరియు ఫ్లోరా షైనీ లలో ఎవరో ఒకరిని వారం రోజుల పాటు బాత్రూం క్లీన్ చేసే డ్యూటీ ఇవ్వాలని అంటాడు నాగార్జున. తనూజ ఆ డ్యూటీ చేయడానికి సిద్ధం గానే ఉంది కానీ, ఫ్లోరా షైనీ మాత్రం వద్దు ప్లీజ్ అంటుంది. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఏ పని అయినా చెయ్యాలి కదా, చెయ్యను అనే మాట ఉండకూడదు కదా , అందుకే ఆ అమ్మాయికి డ్యూటీ ఇచ్చాను అంటాడు. అబ్బో చాలా తెలివి ఉందే అని ఇది చూసిన తర్వాత అనిపించింది. నాకు ఛాన్స్ వస్తుంది, అప్పుడు నేను కూడా చూపిస్తా అని ఫ్లోరా షైనీ పవన్ కళ్యాణ్ ని సవాల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా నేను రెడీ అంటాడు. చూడాలి రాబోయే రోజుల్లో ఈ సైనిక్ లోపల ఏమి చేయబోతున్నాడు అనేది.