Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 చాలా రసవత్తరంగా సాగుతొంది. ఇక ఇంతకు ముందు జరిగిన మూడు ఎపిసోడ్స్ ఒకెత్తయితే ఇప్పుడు జరిగిన నాలుగో ఎపిసోడ్ లో హౌజ్ లో ఉన్న కంటేస్టేలందరు ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూ మాట్లాడుకున్న విధానం అయితే చాలా దారుణమనే చెప్పాలి. ఒక విషయం మీద మొదలుపెట్టి ఎవరికి వారు వాళ్ళ కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అవతల వాళ్ళను బ్లేమ్ చేస్తూ వచ్చారు. ఇక అందులో భాగంగానే ఓనర్స్ దగ్గర ఉన్న గుడ్డు ను సంజన ఎవరికి తెలియకుండా దొంగలించింది…ఇక ఓనర్స్ అందరూ 4 గుడ్లు ఉండాల్సింది, మూడు మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్క గుడ్డు ఎలా పోయింది. ఎవరు తీశారు అంటూ నానా రాద్ధాంతం చేస్తుంటే సంజన మాత్రం తనకేమి తెలియనట్టుగా చాలా సింపుల్ గా క్యాజువల్ గా నవ్వుతూ హౌస్ అంతా తిరుగుతూ ఉంది. ఈ విషయం మీద ఓనర్స్ హ టెనెంట్స్ మధ్య చాలా విపరీతమైన గొడవ అయితే జరిగింది. ఇక మొత్తానికైతే సంజన వచ్చి గుడ్డు దొంగలించింది నేనే…ఆ విషయం తనూజ, భరణి ఇద్దరికీ తెలుసు అని చెప్పింది. అయితే అప్పటివరకు భరణి గుడ్డు ఎవరు దొంగలించారో నాకు తెలియదు అన్నట్టుగా చాలా హడావిడి అయితే చేశాడు. ఇక తనూజ సైతం తనకు తెలియదని చెప్పింది. అయినప్పటికీ సంజన తన గుడ్డు తీసుకున్న విషయం వాళ్ళిద్దరికి తెలుసు అని చెప్పడంతో ఓనర్స్ అందరూ ఒక్కసారిగా భరణి, తనుజ మీద విరుచుకుపడ్డారు…
నిజానికి సంజన చెప్పిన ఆన్సర్ టెనెంట్స్ అందర్నీ ప్రాబ్లం లో పడేసింది. ఇక చివరాఖరుకు భరణి ఓనర్స్ దగ్గర కూర్చొని ఎక్స్ప్లనేషన్ ఇస్తూ సంజన గారికి ఫైవ్ మంత్స్ బేబీ ఉండడం వల్ల ఆమెకు కొంచెం బాడీలో ప్రాబ్లంస్ అయితే ఉన్నాయి. దానివల్ల ఆమెకు హౌస్ లో పెట్టి ఫుడ్ సరిపోవడం లేదని చెప్పి ఆ గుడ్డు తీసుకుంది.
కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండని తనకి చెప్పడంతో మేము ఎవరికీ చెప్పలేదు. ఈ విషయంలో తను చేసింది చాలా పెద్ద తప్పు అంటూ ఆయన ఓనర్స్ దగ్గర ఓపెనప్ అయిపోయాడు. ఇక మొత్తానికైతే సంజన ను కవర్ చేయాలని చూసిన భరణి, తనూజ ఇద్దరు సైతం ఓనర్స్ కి సారీ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
నిజానికి సంజన గుడ్డు తీసుకున్నప్పుడు ఆమె చెప్పకండి అని చెప్పిన కూడా భరణి తనూజ ఇద్దరు తనకున్న ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె గుడ్డు తీసుకుంది. దానికి మీరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకండి అని ఓనర్స్ తో చెబితే బాగుండేది. గుడ్డు ఎవరు తీసుకున్నారు అని అడిగితే అన్ని తెలిసిన కూడా ఏమో నాకు తెలియదు అన్నట్టుగా వాళ్లు వ్యవహరించడంతో హౌస్ మొత్తం రచ్చ రచ్చ అయింది…