Bigg Boss 9 Demon Pavan: ఈ సీజన్ బిగ్ బాస్( Bigg Boss 9 Telugu) రియాలిటీ షో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తోనే ముందుకు సాగుతోంది కానీ, ఎక్కడో బిగ్ బాస్ టీం సామాన్యులకు అన్యాయం చేస్తోంది అనే భావన ఆడియన్స్ లో కలుగుతుంది. ముఖ్యంగా డిమోన్ పవన్ గురించి మాట్లాడుకోవాలి. అగ్నిపరీక్ష షో లో ఇతను పెద్దగా పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఇతను అసలు గేమ్ ఆడలేదు కదా, ఇతనికి బదులుగా నాగ ప్రశాంత్ ని తీసుకోవచ్చు కదా అని అంతా అనుకున్నారు. ఇతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం వెనుక అంతటి నెగిటివిటీ నడిచింది. కానీ ఎప్పుడైతే డిమోన్ పవన్ తన అద్భుతమైన ఆట తీరుని కనబరుస్తూ వచ్చాడో, అప్పటి నుండి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ రీతూ చౌదరి తో ఉండడం వల్ల డిమోన్ పవన్ కి బాగా నెగిటివ్ అవుతోంది.
ఈ వారం మొత్తం డిమోన్ పవన్ రీతూ చౌదరి తో ముచ్చట్లు ఆడుకోవడం, ఆమెతో గొడవ పడడం వంటి కంటెంట్ ని మాత్రమే చూపించారు. కానీ ఆయన ఆడిన ఆటని మాత్రం ఎపిసోడ్ నుండి ఎడిటింగ్ లో లేపేశారు. నిన్న జరిగిన ఒక టాస్క్ లో డిమోన్ పవన్ నిఖిల్, భరణి వంటి టాప్ కంటెస్టెంట్స్ ని ఒక్కడే ఆపేసాడు. అతన్ని విడిపించుకొని వెళ్ళడానికి భరణి కి, నిఖిల్ కి పెద్ద కష్టం అయ్యింది. ఒక్క వ్యక్తి ఇద్దరు బలమైన ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్న కంటెస్టెంట్స్ ని తన సత్తా తో నిలిపేయడం ఏ రేంజ్ ఎలివేషన్స్ వేయొచ్చు మీరే చెప్పండి?, నామినేషన్స్ లో ఉన్న డిమోన్ పవన్ గురించి ఎంతసేపు నెగిటివ్ కంటెంట్ ని టెలికాస్ట్ చేస్తే, అతనికి ఓటింగ్ ఎక్కడి నుండి వస్తుంది?, ఈ వారం డేంజర్ జోన్ లో డిమోన్ పవన్ ఉన్నాడు అంటే నమ్ముతారా?.
నిజంగానే ఆయన డేంజర్ జోన్ లో ఉన్నాడు. మాధురి, రీతూ చౌదరి మరియు డిమోన్ పవన్ లకు ఓటింగ్ లో పెద్ద తేడా లేదంట. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మాధురి, డిమోన్ పవన్ డేంజర్ జోన్ లోకి వస్తే కచ్చితంగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం మాధురి ఎలిమినేట్ అవుతుంది. కానీ తనూజ వద్ద సేవింగ్ పవర్ ఉంది. ఆ పవర్ ని ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మాధురి కి ఉపయోగిస్తుందా?, లేదా డిమోన్ పవన్ కి ఉపయోగిస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. రీతూ చౌదరి, మాధురి ఎలిమినేషన్ రౌండ్ కి వస్తే, తనూజ కచ్చితంగా సేవింగ్ పవర్ ని రీతూ కోసం ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఆమె మొదటి నుండి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఏది ఏమైనా డిమోన్ పవన్ ఆట ని ఎడిటింగ్ లో లేపేయకుండా టెలికాస్ట్ చేసి ఉండుంటే మాత్రం కచ్చితంగా ఆయన డేంజర్ జోన్ నుండి సేవ్ అయ్యేవాడు. ఎలిమినేట్ అయితే ఆ పాపం మాత్రం కేవలం బిగ్ బాస్ టీం కి చెందుతుంది.