Bigg Boss 9 Sreeja: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో చాలా అన్యాయమైన ఎలిమినేషన్ ఏదైనా ఉందా అంటే అది శ్రీజ దమ్ము(Dammu Srija) ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో ఈమెకు సపోర్టుగా వేలాది మంది నెటిజెన్స్ పోస్టులు వేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ శ్రీజ ని మళ్లీ హౌస్ లోకి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ప్రస్తుతానికి అయితే 1 శాతం కూడా లేదు. ఈమె ఎలిమినేషన్ ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సీజన్ లో ఆడియన్స్ ఓటింగ్ కి అసలు విలువే లేదని, ఎదో ఒకటి చేసి బిగ్ బాస్ టీం తమకు కావాల్సిన వాళ్ళను హౌస్ లో ఉంచుకొని, ఇష్టం లేని వాళ్ళను బయటకు పంపిస్తారని స్పష్టంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. పైగా వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి వచ్చిన వారికి చెరో ఒక పవర్ ని ఇచ్చి లోపలకు పంపించారు.
ఆ పవర్స్ లో ఇష్టం లేని వాళ్ళను డైరెక్ట్ గా నామినేట్ చేయడం, ఇష్టమైన వాళ్ళను ఎలిమినేషన్ నుండి తప్పించడం వంటివి ఉన్నాయి. ఇక ఇమ్మానుయేల్ చేతిలో ఉన్న పవర్ అస్త్రా ని ఉపయోగించి, తనకు ఇష్టమొచ్చిన సమయం లో ఒకరిని సేవ్ చేయొచ్చు. కాబట్టి ఓటింగ్ కి ప్రస్తుతం విలువ లేదనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే శ్రీజ తన మనసులో ఉన్న అభిప్రాయాలను నిర్మొహమాటంగా, ఎలాంటి భయం లేకుండా చెప్తుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నాగ చైతన్య(Akkineni Nagachaitanya), సమంత(Samantha Ruth Prabhu) జంట గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నాగార్జున(Akkineni Nagarjuna) వరకు చేరితే, రీ ఎంట్రీ కి ఉన్న ఒక్క శాతం అవకాశం కూడా ఉండదు. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందో చూద్దాం.
ఆమె మాట్లాడుతూ ‘నాగ చైతన్య,సమంత లు పదేళ్ల నుండి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి అయ్యాక నాలుగేళ్లు చాలా సంతోషంగా కలిసి ఉన్నారు. కానీ ఒకరోజు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నాము అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. వైవాహిక బంధం లో ఉన్నప్పుడు వీళ్లిద్దరు ఒక కుక్క పిల్ల పెంచుకున్నారు. సమంత విడిపోయిన తర్వాత ఆ కుక్క పిల్ల నాగ చైతన్య వద్దనే ఉంది. ఒక రోజు సమంత తానూ నిర్మాతగా వ్యవహరించిన సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ఆమెకు కావాలనే గుర్తు చేయడం కోసం నాగ చైతన్య ఆరోజు కుక్క పిల్ల ఫోటోని పెట్టడమే కాకుండా, తన ప్రస్తుత భార్య తో కలిసున్న ఫోటోనో షేర్ చేసాడు. ఇది కావాలని సమంత ని ఉడికించేందుకే పోస్ట్ చేసినట్టు అనిపించింది. ఇన్నేళ్లు ఎప్పుడూ పెట్టని కుక్క పిల్ల ఫోటోని నాగ చైతన్య ఇప్పుడే ఎందుకు పెట్టాడు?, ఆమె సక్సెస్ ని చూసి తట్టుకోలేకపోతున్నాడా?’ అంటూ ఒక వీడియో ని కొన్నేళ్ల క్రితం విడుదల చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఆమె ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఆమెకు సంబంధించిన పాత వీడియోలు కూడా తిరుగుతున్నాయి, ఆ పాత వీడియోలలో ఇది కూడా ఒకటి.
Video of #Srija attacking Naga Chaitanya & Shobitha @iamnagarjuna @StarMaa please don’t bring back her. She is attacking personal lives and passing judgments.
Calling Naga Chaitanya Vadu ..No Respect nothung
✅️#BiggBossTelugu9 #BiggBoss9Telugu— Sreekar (@Sree4you) October 15, 2025