Bigg Boss 9 Contestants List: మరో రెండు నెలల్లో బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) మొదలు కాబోతుంది. ప్రతీ సీజన్ లోనూ కొత్త థీమ్ ని ఎంచుకొని ఆడియన్స్ లో సరికొత్త అంచనాలు రేకెత్తించే బిగ్ బాస్ టీం, ఈసారి కూడా వేరే లెవెల్ థీమ్ తో మన ముందుకు రాబోతుందని తెలుస్తుంది. అయితే గత సీజన్ లో మంచి విషయం ఉన్న కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొచ్చారు కానీ, ఎందుకో సరైన టాస్కులు డిజైన్ చేసినట్టు ఎవరికీ అనిపించలేదు. ఎంతో కంటెంట్ ఉన్నప్పటికీ నాగార్జున(Akkineni Nagarjuna) వీకెండ్ ఎపిసోడ్స్ లో ఆ కంటెంట్ ని వాడుకోలేదు అని చాలా మందికి అనిపించింది. ఈ సీజన్ కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించడేమో అని అంతా అనుకున్నారు. కానీ 12 వ సీజన్ వరకు ఆయన బిగ్ బాస్ టీం తో కాంట్రాక్టు కి సంతకం చేసి ఉన్నాడని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లో బాగా వినిపిస్తున్న పేరు ఇమ్మానుయేల్. జబర్దస్త్ లో టాప్ మోస్ట్ కమెడియన్ గా కొనసాగుతూ వచ్చిన ఇతను, రీసెంట్ గా స్టార్ మా ఛానల్ లోని ఎంటర్టైన్మెంట్ షోస్ లో రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ గేమ్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని ఒక పక్క అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరో పక్క అద్భుతంగా ఆటలు ఆడుతూ మంచి క్రేజ్ ని సంపాదించాడు. ఇతను ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఈ రియాలిటీ షో లోకి అడుగుపెట్టబోతున్న రెండవ కంటెస్టెంట్ పేరు బిత్తిరి సత్తి. ఒకప్పుడు టీవీ షోస్ లో న్యూస్ చానెల్స్ లో రిపోర్టర్ గా బాగా ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ఈమధ్య కాలం లో ఎక్కడా యాక్టీవ్ గా కనిపించడం లేదు.
Also Read: Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9: ఆ కాంట్రవర్సీ లేడీ హౌస్లోకి… మామూలు రచ్చ కాదు!
వచ్చే వారం నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న ‘కూకూ..జాతి రత్నాలు’ ప్రోగ్రాం లో బిత్తిరి సత్తి ఒక కంటెస్టెంట్ గా రాబోతున్నాడు. ఇక ఈ సీజన్ లో పాల్గొనబోతున్న మూడవ కంటెస్టెంట్ పేరు దెబ్జానీ. స్టార్ మా ఛానల్ లో రెండు సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఈమె, రీసెంట్ గానే కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసింది. అదే విధంగా ఈ షో లో రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్య, ప్రియాంక జైన్ (బిగ్ బాస్ 7 కంటెస్టెంట్), శివ కుమార్, యాంకర్ వర్షిణి వంటి వారు కూడా పాల్గొనబోతున్నారని టాక్. వచ్చే నెలలోనే ప్రోమో కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.