Bigg Boss 9 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అగ్నిపరీక్ష షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన సామాన్యులలో రెండవ వారం మనీష్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆడియన్స్ ప్రియా ని టార్గెట్ చేసి మరీ ఎలిమినేట్ చేద్దామని అనుకున్నారు. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద క్యాంపైన్ నడిచింది. కానీ కాస్త క్రాస్ ఓటింగ్ కారణంగా ఫ్లోరా సేవ్ అయ్యింది, మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం కూడా ప్రియా మరియు ఫ్లోరా నామినేషన్స్ లోకి వచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. ఆ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే మిడ్ వీక్ లో ఆడియన్స్ కి బిగ్ బాస్ షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే అగ్నిపరీక్ష షో ద్వారా మరో ముగ్గురు హౌస్ లోపలకు అడుగుపెట్టబోతున్నారట.
వాళ్ళు మరెవరో కాదు , నాగ ప్రశాంత్, షకీబ్ మరియు దివ్య నిఖిత. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వీళ్ళ ముగ్గురు శాశ్వతంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోరు. ఈ ముగ్గురిలో కేవలం ఒకరికి మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి శాశ్వతంగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ టీం ఏమి చెయ్యబోతున్నారంటే, హౌస్ లోకి వచ్చిన ఈ ముగ్గురికి ఒక టాస్క్ ని నిర్వహించబోతున్నారట. ఈ టాస్క్ లో ఎవరైతే విజేతగా నిలుస్తారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత మెంబెర్ గా ఉండబోతున్నారు. వీళ్ళు బుధవారం రోజున అర్థ రాత్రి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారట. అంటే మనకు ఈ ఎపిసోడ్ ని బుధవారం రోజున టెలికాస్ట్ చేయబోతున్నారట. మరి ఈ ముగ్గురిలో ఎవరు బిగ్ బాస్ కుటుంబం లో భాగం కాబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన ప్రశ్న.
ఆడియన్స్ అయితే అత్యధిక శాతం నాగ ప్రశాంత్ లేదా షకీబ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఈ ముగ్గురిలో నాగ ప్రశాంత్ టాస్కులు ఆడే విధానం లో చాలా స్పీడ్ మరియు టాలెంటెడ్. అదే విధంగా దివ్య నిఖిత కూడా తక్కువేం కాదు. ‘అగ్నిపరీక్ష’ చివరి ఎపిసోడ్ లో ఈమె ఏ రేంజ్ లో ఆడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ చూసారు. ఇక షకీబ్ కి బాగా ఆడాలి అనే తపన అయితే ఉంది కానీ, కానీ ఆత్రం కొద్దిగా ఎక్కువ. ఆ కారణంగానే ఈయన అగ్నిపరీక్ష షో లో ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా గెలవలేకపోయాడు. కానీ ఇతను కంటెంట్ ఇవ్వడం లో మంచి తోపు. అందుకే బిగ్ బాస్ టీం ఇతనికి కబురు పంపినట్టు తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో దింపారు బిగ్ బాస్ టీం. చూడాలి మరి ఎలా జరగబోతుంది అనేది.