Bigg Boss 9 Contestants: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss Telugu 9) రియాలిటీ షో మరో నెలరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షో ఇంతకు ముందు సీజన్స్ లాగా కాకుండా, చాలా కొత్తగా ప్లాన్ చేశారు. ఈ సీజన్ లో సామాన్యులకు కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం కల్పించగా, 18 వేల దరఖాస్తుల్లో కేవలం 42 మందిని మాత్రమే ఫిల్టర్ చేసి ఈ అగ్ని పరీక్ష కాంటెస్ట్ కి పంపించారు. ఈ షో షూటింగ్ ప్రస్తుతం మంచి ఊపు మీద జరుగుతుంది. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్ బాస్ పాత సీజన్స్ కంటెస్టెంట్స్ అభిజిత్, నవదీప్,బిందు మాధవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు ఎంచుకోబడిన 42 మంది కంటెస్టెంట్స్ వివిధ రకాల టాస్కులను నిర్వహించి, 15 మందిని ఎంచుకున్నారు. ఈ 15 మందిని మూడు గ్రూపులుగా విభజించారు.
Also Read: ‘వార్ 2’ క్లైమాక్స్ లో జరగబోయేది ఇదేనా..? ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్!
అభిజిత్ గ్రూప్ లో 5 మంది, నవదీప్ గ్రూప్ లో 5 మంది, బిందు మాధవి గ్రూప్ లో 5 మంది ఉంటారు. వీళ్ళ మధ్య టాస్కులు నిర్వహించి గ్రూప్ లీడర్లను విపరీతంగా మెప్పించిన ముగ్గురిని నేరుగా బిగ్ బాస్ 9 షో కి పంపించేస్తారు. మిగిలిన 12 మంది కంటెస్టెంట్స్ కి జియో హాట్ స్టార్ లో పోలింగ్ నిర్వహించి, ఆడియన్స్ ఓటింగ్ లో టాప్ 2 గా వచ్చిన మరో ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అలా మొత్తం మీద 5 మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అన్నమాట. ఇదంతా పక్కన పెడితే అగ్నిపరీక్ష కి ఎంపిక కాబడిన 15 మంది కంటెస్టెంట్స్ పేర్లు, ఫొటోలతో సహా బయటకు లీక్ అయ్యాయి. ఆ లీకైన పేర్లను మేము ఇక్కడ అందిస్తాము, ఫోటోలు కావాలంటే క్రింది వీడియో లో చూడండి.
ఇక ఆ 15 మంది సామాన్యుల పేర్లను పరిశీలిస్తే మాస్క్ మ్యాన్ హృదయ్, మిస్ తెలంగాణ కల్కి, పవన్, అనూష రత్నం, శ్వేతా శెట్టి, శ్రీనాద్ అమ్ము, మర్యాద మనీష్, శ్రీయా, షకీబ్, దలియా షరీఫ్, లాయర్ ప్రశాంత్, ప్రసన్న కుమార్, ప్రియా శెట్టి, సింగర్ శ్రీతేజ్, దమ్ము శ్రీజా. వీరిలో ఇప్పటికే సింగర్ శ్రీతేజ్ ని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు జరుగుతున్న ఈ అగ్నిపరీక్ష షూటింగ్స్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఈ నెల 22 నుండి జియో హాట్ స్టార్ లో టెలికాస్ట్ చెయ్యనున్నారు. కేవలం జియో హాట్ స్టార్ లోప్ మాత్రమే ఈ ఎపిసోడ్స్ ని చూడగలం,టీవీ టెలికాస్ట్ లేదట. ప్రతీ ఎపిసోడ్ ఒక గంట నిడివి ఉంటుందట. అన్ని ఎపిసోడ్స్ ఒకే సారి అప్లోడ్ చేయరు. రోజుకి ఒక ఎపిసోడ్ ని మాత్రమే అప్లోడ్ చేస్తారు.