https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: నిఖిల్, పృథ్వీ లాంటి స్నేహితులు ఇంతకు ముందు సీజన్స్ లో ఉన్నారా..? ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి చూస్తే నిజమే అనిపిస్తుంది!

గత సీజన్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ బాండింగ్ ఎంత స్వచ్ఛంగా ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే శివాజీ వీళ్లిద్దరి ఏజ్ గ్రూప్ కాదు కాబట్టి, వాళ్ళిద్దరిని ఆయన తన కొడుకులు లాగా భావించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 16, 2024 / 01:52 PM IST

    Bigg Boss 8 Telugu(2)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ప్రతీ సీజన్ లో లాగానే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నిజమైన స్నేహితులు ఏర్పడ్డారు. మిగిలిన సీజన్స్ తో పోలిస్తే, ఈ సీజన్ లోనే ఎక్కువ ఉన్నారు. నిఖిల్, పృథ్వీ లతో పాటు అవినాష్, టేస్టీ తేజ, అవినాష్, రోహిణి..ప్రేరణ ,యష్మీ..ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది. కానీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది మాత్రం నిఖిల్, పృథ్వీ గురించి. వీళ్లిద్దరు హౌస్ లో ఉన్నన్ని రోజులు ఒకరి కోసం ఒకరు తీసుకున్న స్టాండ్ అద్భుతంగా ఉన్నింది. మొదటి వారం లో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నిఖిల్ పృథ్వీ ని నామినేట్ చేయాల్సి వస్తుంది. అంతే ఆ తర్వాత వీళ్లిద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. కేవలం ఇదొక్కట్టే కాదు , ఎంత క్లిష్టమైన సందర్భం వచ్చినా ఒకరి కోసం ఒకరు అండగా నిలబడ్డారు. ముఖ్యంగా నిఖిల్ పై సీత నిందలు వేయడం ఎంత సంచలనం గా మారిందో తెలిసిందే.

    ఆ సమయంలో పృథ్వీ నిఖిల్ కోసం తీసుకున్న స్టాండ్ ని చూస్తే వీళ్ళ మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో మరోసారి ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చేసింది. అయితే ఇలాంటి స్నేహితులు గత సీజన్స్ లో కూడా ఉన్నారా అంటే, ఉన్నారు అనే చెప్పాలి.

    సీజన్ 7 లో గౌతమ్, అర్జున్:

    గత సీజన్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ బాండింగ్ ఎంత స్వచ్ఛంగా ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే శివాజీ వీళ్లిద్దరి ఏజ్ గ్రూప్ కాదు కాబట్టి, వాళ్ళిద్దరిని ఆయన తన కొడుకులు లాగా భావించాడు. సమాన వయస్సులో ఇలాంటి బాండింగ్ గత సీజన్ లో అమర్ దీప్, శోభా శెట్టి మధ్య కనిపించింది. ఆరవ వారం నుండి వీళ్లిద్దరు మంచి స్నేహితులు అయ్యారు. ముఖ్యంగా అమర్ ని కెప్టెన్ ని చేసేందుకు శోభా శెట్టి ఎంత తపన పడిందో మనమంతా చూసాము. అదే విధంగా అర్జున్, గౌతమ్ లు కూడా ఇదే తరహా స్నేహితులు అని చెప్పొచ్చు.అర్జున్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిరోజు నుండే గౌతమ్ కి చాలా సపోర్టివ్ గా ఉన్నాడు. వీళ్లిద్దరు నామినేషన్స్ వేసుకోవడం కూడా చాలా తక్కువ.

    సీజన్ 6 లో శ్రీ సత్య, రేవంత్, శ్రీహాన్:

    ఇక సీజన్ 6 లో శ్రీహాన్, రేవంత్, శ్రీ సత్య వంటి వారు ఈ క్యాటగిరీ కి చెందిన వాళ్ళే. కానీ వీళ్ళు హౌస్ లో ఉన్నంత క్లోజ్ గా బయట లేరు. వీళ్ళు బయటకి వచ్చిన తర్వాత కలుసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. రేవంత్ అయితే అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే క్లారిటీ కూడా ఎవ్వరికీ లేదు.

    సీజన్ 5 లో సన్నీ, మానస్:

    ఇక సీజన్ 5 లో సన్నీ, మానస్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బయటకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు అదే స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

    సీజన్ 4 లో అఖిల్, సోహెల్ :

    సీజన్ 4 లో అఖిల్, సోహెల్ మధ్య కూడా ఇంత స్వంచమైన బాండింగ్ ఉండేది. అదే విధంగా సోహెల్, మెహబూబ్ మధ్య కూడా ఇలాంటి స్నేహమే ఉంది. బయటకి వచ్చిన తర్వాత వీళ్లంతా అదే తరహా స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

    సీజన్ 2 లో తనీష్,సామ్రాట్:

    సీజన్ 3 లో ఇలాంటి బాండింగ్స్ కాస్త తక్కువే కానీ, రెండవ సీజన్ లో తనీష్, సామ్రాట్ అన్నదమ్ములు లాగా కలిసి మెలిసి ఉన్నారు. బయటకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇదే బాండింగ్ లో కొనసాగుతున్నారు కానీ మీడియా కి కనపడేది చాలా తక్కువ.

    మొదటి సీజన్ లో నవదీప్, శివబాలాజీ:

    మొదటి సీజన్ లో నవదీప్, శివ బాలాజీ మధ్య ఇలాంటి స్నేహమే ఉండేది. వీళ్లిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుండే మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి చందమామ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మంచి స్నేహితులయ్యారు. వీళ్ళ గ్యాంగ్ లో హరి తేజ కూడా ఉండేది. ఒక విధంగా ఆమె టాప్ 5 వరకు వచ్చిందంటే వీళ్ళ గ్యాంగ్ లో ఉండడం వల్లే అని కొంతమంది అంటుంటారు.