https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిఖిల్ గ్రాఫ్ ని పెంచేందుకు ప్రయత్నం చేసిన అమర్ దీప్..కానీ ఇక కష్టమే..అడ్డంగా దొరికేసాడు!

నిఖిల్ మంచితనం గురించి అమర్ దీప్ మాట్లాడుతూ 'నిఖిల్ కి ఎంత మంచి మనసు ఉందో ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఒకసారి డ్యాన్స్ షోలో నా రెండు కాళ్ళు పక్షవాతానికి గురి అయ్యాయి. అసలు లేచి నిలబడి నడవలేని పరిస్థితి.

Written By: Vicky, Updated On : November 18, 2024 8:35 am
Bigg Boss Telugu 8(221)

Bigg Boss Telugu 8(221)

Follow us on

Bigg Boss Telugu 8: ఫ్యామిలీ వీక్ తర్వాత జరిగే వీకెండ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్నేహితులు, కుటుంబసభ్యులు విచ్చేసి, వాళ్ళ దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్తారు. ఈ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శనివారం ఎపిసోడ్ లో ఆరు మంది కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్నేహితులు, కుటుంబసభ్యులు రాగా, ఆదివారం రోజు మిగిలిన నాలుగు కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబసభ్యులు విచ్చేసారు. నిఖిల్ కోసం అతని స్నేహితుడు అమర్ దీప్, మరియు నిఖిల్ తండ్రి వచ్చారు. అమర్ దీప్ నిఖిల్ కి ఇచ్చిన సలహాలు చాలా బాగున్నాయి. అదే విధంగా నిఖిల్ మంచితనం గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు నిఖిల్ ఓటింగ్ గ్రాఫ్ ని పెంచేలా ఉంది.

నిఖిల్ మంచితనం గురించి అమర్ దీప్ మాట్లాడుతూ ‘నిఖిల్ కి ఎంత మంచి మనసు ఉందో ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఒకసారి డ్యాన్స్ షోలో నా రెండు కాళ్ళు పక్షవాతానికి గురి అయ్యాయి. అసలు లేచి నిలబడి నడవలేని పరిస్థితి. ఆ సమయంలో నిఖిల్ నన్ను వాళ్ళ రూమ్ కి తీసుకెళ్లి రెండు రోజుల పాటు నాకు సేవలు చేసాడు. చివరికి వాష్ రూమ్ కి వెళ్లాలన్నా వాడే నన్ను తీసుకెళ్ళేవాడు’ అని చెప్పుకొచ్చాడు. గత రెండు వారాలుగా నిఖిల్ కి నెగటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి, అమర్ చెప్పిన ఈ చిన్న సంఘటన నిఖిల్ పై విపరీతమైన పాజిటివిటీ పెంచేలా చేసింది. అయితే ఇది ఆయనకీ ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. యష్మీ పట్ల నిఖిల్ ఏదైతే చేసాడో, అది కచ్చితంగా చాలా పెద్ద తప్పు. యష్మీ తనకి నిఖిల్ మీద ఉన్న ఫీలింగ్స్ ని బహిరంగంగా అతినికే చెప్పింది. నిఖిల్ ఆమె ప్రేమని మనస్ఫూర్తిగా స్వీకరించలేదు, అదే విధంగా ఆమెని దూరం కూడా పెట్టలేదు.

మనసులో ఇష్టం ఉంది కానీ, బయటపడను అనే విధంగా నిఖిల్ ప్రవర్తించాడు. శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని వారికి సంబంధించిన మొదటి ప్రేమ గురించి చెప్పమని అడగగా, నిఖిల్ తన మాజీ ప్రేయసి కావ్యశ్రీ గురించి తల్చుకుంటూ, ఆమెతో విడిపోయినందుకు బాధగా ఉంది, కచ్చితంగా బయటకి వెళ్లిన తర్వాత ప్యాచప్ అవుతాను అని చెప్పాడు. అప్పటి వరకు యష్మీ కి నిఖిల్ మనసులో ఈ ఉద్దేశ్యం ఉందనే విషయమే తెలియదు. అతని కోసం ఈమె ఆట మొత్తం చెడగొట్టుకుంది. ఎప్పుడైతే నిఖిల్ వాళ్ళ అమ్మ లోపలకు వచ్చి యష్మీ ని కంట్రోల్ లో పెట్టు అని చెప్పిందో, అప్పుడే నిఖిల్ తన మనసులోని మాటని బయటపెట్టి యష్మీ మనసు విరిచేసాడు. అంటే ఇన్ని రోజులు యష్మీ ని కేవలం తన గేమ్ కోసం వాడుకున్నాడా? అనే సందేహాలు నిఖిల్ ని అభిమానించే వాళ్లకు కూడా కలిగింది. ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ నిఖిల్ కి చాలా పెద్ద నెగటివ్ కానుంది. అమర్ దీప్ నిఖిల్ గురించి చెప్పిన ఆ చిన్న పాజిటివ్ విషయం జనాలు మర్చిపోవచ్చు.