Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కారణంగా గ్యాప్ లేకుండా ఏడిపించేస్తున్నాడు బిగ్ బాస్. లోపలున్న కంటెస్టెంట్స్ తో పాటు చూసే ఆడియన్స్ కి కూడా కళ్ళలో నీళ్ళు తిరిగేలా ఎమోషనల్ సీన్స్ పడుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ వాళ్ళ అమ్మగారు అందరిని ఏడిపించారు. కాగా ఈ రోజు శోభా శెట్టి తల్లి రాకతో బిగ్ బాస్ ఇల్లు ఫుల్ ఎమోషన్స్ తో నిండిపోయింది. ముందుగా ఆమె ఫ్లోర్ కి మొక్కి హౌస్ లో అడుగు పెట్టింది.
తల్లిని చూడగానే మమ్మీ .. అంటూ పరుగెత్తుకెళ్లింది శోభా. మమ్మీ .. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే .. ఏడవకు అంటూ ధైర్యం చెప్పింది శోభా తల్లి. ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించింది. శివాజీ ని చూసి అన్నయ్యా అంటూ ఎమోషనల్ అయ్యింది. తర్వాత యావర్ తో ‘ నిన్న ఎందుకు ఏడ్చావ్ .. అమ్మ లేదనా అంటూ ఇదిగో మీ అమ్మ .. అంటూ ఓ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ ఫోటోలో ఉన్నది యావర్ తల్లి. ఫోటో చూసి యావర్ పెద్దగా అరుస్తూ ఏడ్చేశాడు.
సంతోషంలో శోభా తల్లి కాళ్ళు పట్టుకుని వదలలేదు ప్రిన్స్ యావర్. దీంతో ఆమె యావర్ కి దగ్గరికి తీసుకుని రేయ్ నువ్వు నా కొడుకు రా … ఏడవ కూడదు అంటూ ధైర్యం చెప్పింది. యావర్ అమ్మ ఫోటో చూస్తూ మురిసిపోయాడు. తర్వాత వచ్చేది మీ అన్నే రా అని అర్జున్ అన్నాడు. అమ్మ గుర్తొచ్చి ఏడుస్తున్న యావర్ ని ‘ఏడిస్తే అమ్మ ఊరుకోదు అంటూ గౌతమ్ ఓదార్చాడు.
ఇక తర్వాత శోభా శెట్టి కి ఆమె తల్లి మంచి మాట చెప్పారు. నీ కోపం నాకు తెలుసు .. నీకు తెలుసు కానీ వాళ్లకు తెలియదు కదా అంటూ కోపం తగ్గించుకోమని సూచించింది. తర్వాత అశ్విని మీకు తెలుగు రాదు అన్నారు తెలుగు బాగానే మాట్లాడుతున్నారు అని అడిగింది. రోజు తెలుగు చూస్తున్న కదా అని ఆమె చెప్పారు. ఇక హౌస్ ను వదిలి వెళ్తూ .. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ కి ధన్యవాదాలు తెలిపారు శోభా శెట్టి అమ్మగారు.