Bigg Boss 7 Telugu : 12వ వారం నామినేషన్ లిస్ట్ లీక్… టాప్ కంటెస్టెంట్స్ లో ఎలిమినేట్ అయ్యేదెవరు?

అయితే వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. కాగా శివాజీ, అమర్, ప్రశాంత్ వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. గౌతమ్, అర్జున్, యావర్ లో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. లేదంతే రతిక, అశ్విని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కాగా 10వ వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు.

Written By: NARESH, Updated On : November 20, 2023 4:42 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో గత ఆదివారం ఎలిమినేషన్ రద్దు చేశారు. అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరుగుతుందని నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పారు. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసి కారణంగా .. నెక్స్ట్ వీక్ మరో సారి ఏవిక్షన్ పాస్ కోసం పోటీ జరుగుతుంది. హౌస్ లో ఉన్న పది మంది పోటీ పడి గెలుచుకోవచ్చని నాగార్జున చెప్పారు. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ రంజుగా సాగుతుంది. ఇంటి సభ్యులు ఓ రేంజ్ లో గొడవ పడుతున్నారు.

నేటి ఎపిసోడ్ లో జరగబోయే నామినేషన్ ప్రక్రియలో భాగంగా .. ఒక సింహం బొమ్మ పెట్టి .. అది ఆకలితో ఉంది .. హౌస్ మేట్స్ అనర్హులని భావించిన ఇద్దరి ఫోటోలు ఉన్న చికెన్ ముక్కని సింహం నోటిలో వెయ్యాలి. నిజానికి వీకెండ్ లో నాగార్జున ఎవరినైతే తప్పు పట్టి తిడతారో .. ఆ కంటెస్టెంట్ ని నామినేషన్స్ లో ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలోనే యావర్ ని ఎక్కువ మంది టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

యావర్ తో పాటు శివాజీ ఇంకా ప్రశాంత్ కూడా టార్గెట్ అయ్యారు. ప్రశాంత్ ని రతిక , గౌతమ్ నామినేట్ చేసినట్లు సమాచారం. ఇక శివాజీని .. అర్జున్ గౌతమ్ నామినేట్ చేశాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ముగిసాక .. ఈ వారం కూడా ఎనిమిది మంది నామినేషన్ లిస్ట్ లో ఉన్నట్లు లీక్ వచ్చింది. అర్జున్, అమర్ దీప్, గౌతమ్, అశ్విని, రతిక రోజ్, శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ లిస్ట్ లో ఉన్నారు.

అయితే వీరిలో ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు. కాగా శివాజీ, అమర్, ప్రశాంత్ వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. గౌతమ్, అర్జున్, యావర్ లో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. లేదంతే రతిక, అశ్విని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కాగా 10వ వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు.