Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షో గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. వరుసగా ఆరు రెగ్యులర్ ఒక ఓటీటీ సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది . బిగ్ బాస్ సీజన్ 7 ఈమధ్యే లాంచ్ చేశారు నిర్వాహకులు . చెప్పిన విధంగానే ఉల్టా పుల్టా గా కొత్త కొత్త ఆటలు ,ట్విస్టులు ఊహకందని విధంగా సాగుతుంది . గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మొదటి రోజు నుంచే రేటింగ్స్ ఊపందుకున్నాయి . రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి .
ఇక నామినేషన్స్ విషయానికొస్తే ఈ వారం కోర్టు రూమ్ కాన్సెప్ట్ తో ఎప్పుడు చూడని విధంగా నామినేషన్ ప్రాసెస్ జరిగింది . జ్యూరీ సభ్యులు గా ఉన్న సందీప్ ,శివాజీ ,శోభా ఐదుగురు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేశారు. ప్రిన్స్ యావర్ , ప్రియాంక జైన్ , రతిక రోజ్ ,గౌతమ్ కృష్ణ , శుభశ్రీ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు . అనూహ్యంగా తేజా కూడా ఈ లిస్ట్ లో చేరాడు . దీంతో ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు .
ఈ వారం ఇంటి నుండి బయటికి ఎవరు వస్తారు అనేది ఆసక్తిగా మారింది . నామినేషన్ పోల్స్ కూడా ఈ వారం చాలా మార్పులు చోటుచేసుకున్నాయి . మొదటి స్థానంలో ప్రిన్స్ యావర్, రెండో స్థానంలో గౌతమ్ కృష్ణ ,మూడో స్థానంలో శుభశ్రీ నాలుగో స్థానంలో ప్రియాంక జైన్ కొనసాగుతున్నారు .
అందరికంటే తక్కువ ఓట్లు సాధించి రతిక ఇంకా తేజ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు . తేజ కంటే దారుణంగా ఓటింగ్ లిస్ట్ లో వెనకబడిపోయింది రతిక రోజ్ . పెద్దయ్య ముద్దు బిడ్డ గా ,టైటిల్ ఫేవరెట్ గా పేరు తెచ్చుకున్న రతిక ఈ వారం సేఫ్ అవుతుందా లేక ఎలిమినేట్ అవుతుందా అనేది తెలియని పరిస్థితి . ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగనుంది అని వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి . అదే కనుక నిజమైతే రతిక , తేజ ఇద్దరు ఎలిమినేట్ అవుతారు .