Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరు అవుతారు అనేది ఉత్కంఠగా మారిన అంశం. ఇప్పటికే షో చివరి దశకు వచ్చింది. ఆదివారం బిగ్ బాస్ షో కి ఎండ్ కార్డు పడనుంది. ఇక నిన్నటితో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది.దీంతో ప్రేక్షకులు తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ని గెలిపించుకునేందుకు తెగ కష్ట పడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పీఆర్ టీమ్స్ ఫ్యాన్స్ ని ఆఖరి రోజు ఓట్లు వేయండి అంటూ అలర్ట్ చేస్తున్నారు.
ఏడో సీజన్ ఫినాలే వీక్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ టైటిల్ రేస్ లో నిలిచారు. 14వ వారం లో విన్నర్ ఓటింగ్ మొదలైపోయింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైన్నట్లు తెలుస్తుంది. ఇక టైటిల్ బరిలో ఉన్న ఆరుగురికి రెండు పద్ధతుల్లో ఓటింగ్ బిగ్ బాస్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం .. హాట్ స్టార్ ఓటింగ్ లో శివాజీ కి ఎక్కువ శాతం ఓటింగ్ పోల్ అవుతున్నట్లు తెలిసింది.
తర్వాత రెండో స్థానంలో ప్రశాంత్ ఉన్నాడని అంటున్నారు. ఇక మూడో పొజిషన్ లో అమర్ దీప్ ఉన్నాడని తెలిసింది. కాగా మిస్డ్ కాల్స్ ద్వారా వచ్చిన ఓట్లలో ప్రశాంత్ టాప్ లో ఉన్నాడని సమాచారం. ఎక్కువ శాతం రూరల్ ఏరియా నుంచి ప్రశాంత్ కి కాల్స్ రూపంలో ఓట్లు వచ్చాయట. ఇందులో శివాజీ రెండో స్థానంలో ఉండగా .. మూడో ప్లేస్ లో అమర్ ఉన్నాడని టాక్.
అయితే హాట్ స్టార్ ఓట్లతో శివాజీ టాప్ లో ఉంటే .. మిస్డ్ కాల్స్ లో ప్రశాంత్ ముందంజలో ఉన్నాడు. దీంతో ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ ఎక్కువ శాతం ప్రశాంత్ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక శివాజీ రన్నర్ గా నిలుస్తారు అని టాక్. ఇక ఈ సీజన్ ప్రారంభం లో విజేతగా నిలిచే కంటెస్టెంట్ అనుకున్న అమర్ మూడో స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో యావర్, ప్రియాంక, అర్జున్ ఉన్నారు.