Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ఎంత ఆర్జించాడో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం ముగిసింది. మొత్తం 19 మంది పాల్గొన్న ఈ షోలో శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, యావర్, ప్రియాంక ఫైనలిస్ట్స్ అయ్యారు. వీరిలో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఫస్ట్ అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు.
టాప్ 5లో ఉన్న ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. అనంతరం యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అతడు నాగార్జున ఆఫర్ చేసిన రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుండి తప్పుకున్నాడు. తన ఫ్యామిలీ నిర్ణయమే తన నిర్ణయం అన్న యావర్, వారి సలహా మేరకు డబ్బులు తీసుకున్నట్లు వెల్లడించాడు. టాప్ 3లో శివాజీ, అమర్, ప్రశాంత్ మిగిలారు. తర్వాత శివాజీ ఎలిమినేట్ అయ్యారు. ఆయనకు మూడో స్థానం దక్కింది. ఇక టైటిల్ రేసులో ప్రశాంత్-అమర్ మిగిలారు.
ఉత్కంఠ మధ్య పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు నాగార్జున ప్రకటించారు. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ కి ఎంత ఆర్జించాడో చూస్తే… యావర్ రూ. 15 లక్షలు తీసుకోవడంతో ప్రైజ్ మనీ రూ.35 లక్షలకు చేరింది. దాంతో పాటు రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ, మరో రూ. 15 లక్షల విలువైన మారుతీ సుజుకీ బ్రీజా కారు పల్లవి ప్రశాంత్ కి దక్కాయి. అయితే వీటన్నింటి మీద టాక్స్ ఉంటుంది. అది కట్ చేసి ఇస్తారు. రూ. 35 లక్షల్లో ప్రశాంత్ చేతికి వచ్చేది రూ. 16 లక్షలే అని సమాచారం.
ఇక పల్లవి ప్రశాంత్ వారానికి రూ. 1 లక్ష ఒప్పందంతో హౌస్లేవ్ అడుగుపెట్టాడట. అలా రూ. 15 లక్షలు అందుకోనున్నారు. మొత్తంగా ఒక రూ. 60 లక్షల వరకూ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా ఆర్జించాడు. అయితే ఎంత గెలిచినా అది రైతులకే అని ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు. తాను టైటిల్ గెలిస్తే ఆ వచ్చే డబ్బుతో పేద రైతులకు సహాయం చేస్తానని హౌస్లో పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు. ప్రశాంత్ దెబ్బకు ఫేమస్ అయ్యాడు.