Bigg Boss 7 Telugu : శోభాపై నెగిటివిటీ ఉన్నా అందుకే ఎలిమినేట్ కాలేదు.. అసలు మేటర్ లీక్ చేసిన ప్రియుడు!

కొన్ని చోట్ల రియాక్ట్ కాకుండా ఉంటేనే మంచిది. శోభా గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం కామనే. వాటిని మనం పట్టించుకోకూడదు. శోభా టాప్ 5 లో ఉండాలనే కోరుకుంటున్నాను.

Written By: NARESH, Updated On : December 7, 2023 8:15 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి నామినేషన్స్ ఉన్న ప్రతిసారీ లీస్ట్ ఓటింగ్ తోనే ఉంటుంది .. కానీ ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి మాత్రం ..బిగ్ బాస్ సపోర్ట్ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నిజంగానే సపోర్ట్ చేస్తున్నారా .. ముందుగానే అగ్రిమెంట్ జరిగిందా .. అన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చాడు ఆమె ప్రియుడు యశ్వంత్ రెడ్డి.

శోభ శెట్టి కి ఓట్లు వేసి సపోర్ట్ చేయాలి అంటూ .. లైవ్ వచ్చిన యశ్వంత్ రెడ్డి, పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ‘ బిగ్ బాస్ శోభకు హెల్ప్ చేస్తున్నారు అంటున్నారు కానీ .. అవేం నిజం కాదు. అవన్నీ రూమర్లు మాత్రమే. వాటిని పట్టించుకోకూడదు .. అలా సేవ్ అయ్యారు .. ఇలా సేవ్ అయ్యారు అంటున్నారు. నిజానికి ఓట్లు వేస్తున్నారు కాబట్టి శోభా హౌస్ లో ఉంది. బిగ్ బాస్ కాపాడితే కాదు. శోభా పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ అవుతాయి.

కొన్ని చోట్ల రియాక్ట్ కాకుండా ఉంటేనే మంచిది. శోభా గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం కామనే. వాటిని మనం పట్టించుకోకూడదు. శోభా టాప్ 5 లో ఉండాలనే కోరుకుంటున్నాను. హౌస్ లో అందరూ జెన్యూన్ గా ఉండాలనే వెళ్తారు .. శోభా ముక్కుసూటిగా ఉంది అంతే. శోభా ఈ వారం ఎలిమినేట్ అయితే అవుతుంది .. ఎలిమినేట్ అయినా ఇంటికే కదా వస్తుంది.

శోభకు ఓట్లు వేయండి. శోభా ఎంత నెగిటివ్ అయినా ఏం పర్లేదు… అది మంచిదే నచ్చిన వాళ్ళు ఓట్లు వేయండి. చాలా మంది నాకు మెస్సేజ్ లు పెడుతున్నారు .. శోభని చూస్తుంటే మమ్మల్ని చూసుకున్నట్లు ఉందని .. పరిస్థితిని బట్టి బిహేవ్ చేస్తారు. అన్ని చోట్ల ఒకేలా ఉండరు కదా .. సిట్యువేషన్ బట్టి మాట్లాడతారు. శోభా కూడా అలాగే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు శోభా బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి. అయితే శోభ ఫినాలేకి వెళ్లే ఛాన్స్ లేదని సమాచారం. ఆమె టాప్ 5లో కష్టమే అంటున్నారు.