Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వారం పవర్ అస్త్రాలకి ముగింపు పలికి ,మొదటి కెప్టెన్సీ టాస్క్ ప్రారంభించాడు. దీని కోసం హౌస్ లో ఉన్న పది మంది జంటలు గా మారారు. గౌతమ్-శుభశ్రీ ,తేజ -యావర్ ,శివాజీ -పల్లవి ప్రశాంత్ ,ప్రియాంక -శోభా ,అమర్ -సందీప్ మాస్టర్ ఉన్నారు. కెప్టెన్సీ రేస్ లో భాగంగా బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు ఇచ్చాడు. అందరి కంటే ఎక్కువ స్టార్స్ సాధించి శివాజీ మొదటి స్థానంలో నిలిచారు. తక్కువ స్టార్స్ ఉన్నందున శోభా -ప్రియాంక టీమ్ రేస్ నుంచి తప్పుకున్నారు.
ఇక రేస్ లో ఉన్న నాలుగు జంటలకు ఒక టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ కి ఇంటి నుంచి కొన్ని లెటర్స్ వచ్చాయి. ఇందులో కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. లెటర్ జంటలోని ఒక్కరు మాత్రమే చదవాలి. మిగిలినవారు త్యాగం చెయ్యాలి అంటూ కండిషన్ పెట్టాడు. లెటర్ చదివినవారు కెప్టెన్సీ పోటీ నుంచి తొలిగిపోతారు అని చెప్పాడు. దీంతో శివాజీ కి చాలా కోపం వచ్చింది. నేను ఇంక ఆడను బిగ్ బాస్ అంటూ మైక్ తీసి పక్కన పారేసాడు.
మీరేంటి ఇలా చేస్తున్నారేంటి అంటూ హౌస్ ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు. శివాజీ కోపంలో అర్థముంది.బిగ్ బాస్ పెట్టిన కండిషన్ అలాంటిది. ఇంటి నుంచి లెటర్స్ రావడంతో కంటెస్టెంట్స్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.జంట లోని ఒకరు మాత్రమే లెటర్ చదవాలి అనే సరికి తేల్చుకోలేక బాధపడ్డారు. వారం మొత్తం కష్టపడి ఆడితే జంటలో ఒకరు మాత్రమే కెప్టెన్సీ రేస్ లో ముందుకు సాగుతారు. ఇలాంటి కండిషన్ పెట్టినందుకు శివాజీ ఫైర్ అయ్యాడు.
ఇక ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్, తేజా, సందీప్, గౌతమ్ నెగ్గారు. ఈ నలుగురు కంటెండర్ రేసులో ఉన్నారు. పల్లవి ప్రశాంత్ హౌస్ కెప్టెన్ అయిన్నట్లు సమాచారం. ఇది నిజంగా సంచలనం అని చెప్పాలి.