Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ కింగ్ నాగార్జున ఊహించని షాక్స్ ఇస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సాధారణంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ సాగుతుంది. ఈసారి ఎలిమినేషన్ తో స్టార్ట్ అవుతుందని నాగార్జున అన్నాడు. అందుకే ఎలిమినేషన్ లో ఉన్న 7గురికి హౌస్ మేట్స్ గా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, శోభా శెట్టిలను గుడ్ బై చెప్పేయమన్నాడు. ఎందుకంటే ఎలిమినేటైన కంటెస్టెంట్ మళ్ళీ వాళ్లకు కనపడడు. అటు నుండి అటే ఇంటికి వెళ్ళిపోతాడని నాగార్జున చెప్పాడు.
శివాజీ, యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక, తేజా, అమర్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిని ఒక డార్క్ రూమ్ కి పంపారు. అందులో స్మశానం ని పోలిన సెటప్ ఉంది. స్కల్ ఫేస్ మాస్క్ గా ఉన్న ఓ వ్యక్తి ఆ గదిలో సంచరిస్తున్నాడు. మరి ఎవరు ఎలిమినేటై ఇంటికి వెళ్ళిపోతారనే ఉత్కంఠ నెలకొంది.
అయితే ఈ వారం ఒకరు సీక్రెట్ రూమ్ కి వెళతారని సమాచారం. శుభశ్రీని ఎలిమినేట్ చేసి ప్రియాంకను ఎలిమినేట్ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ 2.0 అంటూ నేడు మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఎపిసోడ్ గెస్ట్స్ గా సిద్ధార్థ్, రవితేజ వచ్చారు. సిద్దార్థ్ ఏకంగా హౌస్లోకి వెళ్లి కంటెస్టెంట్స్ ని కలిశారు.
రవితేజ తేజ దుమ్మురేపే ఎంట్రీ ఇచ్చాడు. ఆయన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన బిగ్ బాస్ షోకి వచ్చారు. అలాగే నేటి ఎపిసోడ్లో కొందరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అంబటి అర్జున్, పూజా మూర్తితో పాటు కొందరు సెలెబ్స్ పేర్లు వినిపిస్తున్నాయి. రతికా రోజ్ లేదా దామిని రీ ఎంట్రీ కూడా ఇవ్వొచ్చని టాక్. చూడాలి ఈ ఆదివారం ఎపిసోడ్ ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వనుందో…