Prince Yawar
Prince Yawar: బిగ్ బాస్ హౌస్ లో రతిక అన్ని విధాలుగా వరెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకుంది. ఒకసారి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లొచ్చినా కూడా ఆమె బుద్ధి మార్చుకోవడం లేదు. కెప్టెన్సీ టాస్క్ లో అమర్ పట్ల రతిక చాలా దారుణంగా ప్రవర్తించింది. గత వారంలో జరిగిన బొమ్మల టాస్క్ లో అమర్ దీప్ ఆమెకు హెల్ప్ చేసాడు. ఆ ఆలోచన కూడా లేకుండా .. అమర్ ఏడుస్తున్న సరే రతిక కనికరించలేదు.
బిగ్ బాస్ ఆమెకు రీ ఎంట్రీ పేరుతో ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. కానీ రతిక మాత్రం నిరూపించుకోవడం మానేసి .. ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటుంది. యావర్ ఎవిక్షన్ పాస్ గెలిచే సరికి అతని చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. రీ ఎంట్రీ తర్వాత ప్రశాంత్ ని మళ్ళీ ట్రాక్ లో దింపాలని చూసింది రతిక. అతను అక్క అని పిలవడంతో .. రూటు మార్చింది. యావర్ తో క్లోజ్ గా ఉండటం మొదలు పెట్టింది.
అయితే ఫ్యామిలీ వీక్ తర్వాత యావర్ .. రతిక ని దూరం పెట్టాడు. ఇక శివాజీ కూడా హెచ్చరించడంతో యావర్ కి రతిక దూరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యావర్ ఎవిక్షన్ పాస్ గెలిచాడో .. మళ్లీ కవ్వింపు మొదలు పెట్టింది రతిక. యావర్ ని చూసి నవ్వడం .. పదే పదే అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. దీంతో యావర్ నిన్ను హాగ్ చేసుకోవచ్ఛా అని అడగడంతో .. ఓకే చెప్పి టైట్ హగ్ ఇచ్చేసింది.
తర్వాత బాల్కనీ లో కూర్చుని ఉన్న అమర్, గౌతమ్, అర్జున్.. రతికను అడిగారు. అయితే ‘ వాడే అడిగాడు హగ్ చేసుకోవచ్చా’ అని అంటూ రతిక సిగ్గు పడింది. ముందు పాస్ గెలిచి తర్వాత నిన్ను గెలుచుకోవాలని అనుకున్నాడేమో.. అంటూ అర్జున్ వెటకారం చేసాడు. అవునా.. ఏమో ఛీ ..తు అని రతిక పైన ఉసుకుని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో యావర్ కి ఎవిక్షన్ పాస్ వచ్చిందో లేదో .. రతిక గేర్ మార్చేసిందంటూ హౌస్ లోనే కాదు బయట కూడా అనుకున్నారు. .
అనూహ్యంగా యావర్ ఎవిక్షన్ పాస్ రద్దు అయ్యింది. నువ్వు ఫెయిర్ గా ఆడి గెలవలేదని నాగార్జున యావర్ ని నిలదీయడంతో వెనక్కి ఇచ్చేశాడు. దీంతో రతిక ఆశలు గల్లంతు అయ్యాయి. యావర్ ని ఈజీగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయవచ్చు. ఒకవేళ తాను ఎలిమినేట్ అయితే ఎవిక్షన్ పాస్ వాడుకోవచ్చని అనుకుంది. అందుకే వలపుల వల విసిరింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.