Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ కాస్త ఎంటర్టైనింగ్ గా ఉండేలా రూపొందించారు బిగ్ బాస్. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇరు టీమ్స్ మధ్య టాస్క్ లు పెట్టాడు. మొత్తం మూడు టాస్క్ లు పెడితే, వరుసగా రెండు సార్లు జిలేబీ పురం టీమ్ విజయం సాధించి సత్తా చాటుకుంది. గ్రహాంతర వాసుల స్పేస్ షిప్ ఛార్జ్ చెయ్యాలి అంటూ మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో గులాబీ పురం టీమ్ విన్ అయింది. ఇక ఈరోజు విడుదలైన తాజా ప్రోమోలో ఇంటి తదుపరి కెప్టెన్ అవ్వడానికి ఎవరు అర్హులో మీరే డిసైడ్ చేయాలి అంటూ కంటెస్టెంట్స్ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్.
నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అవుతారు అని తెలుసుకోవడానికి ‘ఫ్లోట్ ఆర్ సింక్ ‘ అని ఫైనల్ టాస్క్ పెట్టారు.దీనిలో ఎవరి ఫోటో అయితే మునిగిపోకుండా ఉంటుందో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ గా కొనసాగుతారు అని చెప్పారు బిగ్ బాస్. ఎవరు కెప్టెన్ గా అనర్హులు అని భావిస్తున్నారు చెప్పమని కంటెస్టెంట్స్ కి అవకాశం ఇచ్చారు. దీంతో ముందుగా శోభా వచ్చి అశ్విని పేరు చెప్పింది. ఇక్కడున్న వారందరిలో కంపేర్ చేస్తే కెప్టెన్ అవ్వడానికి ఫిట్ కాదు.
నీలో ఆ కెప్టెన్సీ పవర్ నాకు కనిపించట్లేదు అంటూ శోభా చెప్పింది. దీంతో నీకు ఎప్పటికీ కనిపించదులే అంటూ అశ్విని కౌంటర్ ఇచ్చింది. శోభా కోపంగా అశ్విని ఫోటో పూల్ లో విసిరికొట్టింది. ఆ తర్వాత పూజ, ప్రశాంత్ ని అనర్హుడిగా ప్రకటించి అందరికి అవకాశం రావాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ఇక ప్రశాంత్ కాసేపు వాదించాడు. ఇక ప్రశాంత్ ఫోటో ని నీటిలో ముంచేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించింది.
ఇక ఆ తర్వాత యావర్,ప్రియాంక తో ఎవరితో నైనా ఏదైనా గొడవ జరుగుతుంది అంటే వచ్చి మధ్యలో దూరుతావు. ఆ రోజు స్ప్రైట్ గురించి అమర్ కి నాకు గొడవ జరుగుతుంటే నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు అని అన్నాడు. దాంతో ప్రియాంక లెటర్ వచ్చిందా అని అడగడానికి వచ్చాను. అమర్ వస్తే నేను మధ్యలో రావాలని రూల్ లేదు. నేను సోలో .. సోలో గానే వచ్చా .. సోలో గానే ఆడుతాను .. సోలో గా వెళ్తాను అంటూ చెప్పింది. బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇక ఈ వారం కెప్టెన్ ఎవరు అవుతారు అనేది తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.
The suspense is building! Stay tuned to find out who will be the next captain of the Bigg Boss House. It’s a game-changer! #BiggBossTelugu7 #Nagarjuna #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel
Link: https://t.co/r27x216IsG
— Starmaa (@StarMaa) October 20, 2023
.