Bigg Boss 7 Telugu : బొక్కలో ఆట తొక్కలో సంచాలక్… అమర్ పై నాగ్ ఫైర్!

ఈ టాస్క్ లో సంచాలక్ అమర్ నువ్వే, మాటి మాటికి నువ్వు అందరిని తొక్క లో ఆట అంటావు కదా అని ప్రశ్నించాడు.

Written By: NARESH, Updated On : October 7, 2023 9:58 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ అవతరించాడు. గట్టి పట్టుదలతో అతడు సంచలనానికి తెరలేపాడు. ఇక వీకెండ్ ఎపిసోడ్ కావడం తో నాగార్జున సందడి చేశారు. ముందుగా తేజా ఇంకా యావర్ జంట పై ప్రశంసలు కురిపించారు. తేజ నువ్వు ఎంటర్టైన్ చేస్తానని మాట ఇచ్చావ్ నీ మాట నిలబెట్టుకున్నావ్ అంటూ ప్రశంసించారు. మిమ్మల్ని చూస్తే ముచ్చటేసింది అన్నారు. వీరిద్దరూ లెటర్స్ త్యాగం చేసే విషయంలో ఒకరికి మరొకరు పోటీపడ్డారు. ఈ క్రమంలో నాగార్జున పొగిడారు.

అనంతరం అమర్ -సందీప్ జోడీని మీరు గేమ్ పూర్తి కాకుండానే బెల్ ఎందుకు కొట్టారు అని అడిగాడు నాగార్జున. అమర్ దీప్ ఏదో అర్థం లేని సమాధానం చెప్పాడు. మీ తెలివి తేటలు పరాకాష్టకు చేరాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాస్క్ కి సంబంధించిన వీడియో వేసి చూపించి,ఈ టాస్క్ లో సంచాలక్ ఎవరు అని అడిగాడు. ఎవరు లేరు అని అందరూ సమాధానం చెప్పారు.

ఈ టాస్క్ లో సంచాలక్ అమర్ నువ్వే, మాటి మాటికి నువ్వు అందరిని తొక్క లో ఆట అంటావు కదా అని ప్రశ్నించాడు. దానికి అమర్ ఏదో ఫ్రెండ్ షిప్ లో అన్నాను సర్ అన్నాడు. నేను కూడా ఫ్రెండ్ షిప్ లో అంటున్న నీది బొక్కలో ఆట నువ్వు తొక్కలో సంచాలక్ అని నాగ్ ఫైర్ అయ్యారు.

అని అమర్ కి ఇచ్చి పడేసాడు నాగ్.అంతా నాకే తెలుసు,నేనే గెలవాలి అనుకుంకుంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్న అమర్ -సందీప్ జట్టుకి బాగా బుద్ధి చెప్పాడు నాగార్జున.దెబ్బకి చేసేదేమి లేక గమ్ముగా నుంచున్నారు. ప్రోమో మాత్రం మామూలుగా లేదు. ఎపిసోడ్ చూస్తే ఇంకా మజా వస్తుంది అనిపిస్తుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రియాంక అవుట్ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

https://twitter.com/StarMaa/status/1710566942158078378