Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం కెప్టెన్సీ రేస్ రసవత్తరంగా సాగింది. ఈ రోజు కెప్టెన్సీ రేస్ లో భాగంగా కంటెండర్స్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్,శోభా,ప్రియాంక ,సందీప్,గౌతమ్ లకు ఆఖరి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.అయితే ఈ టాస్క్ లో కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఒకరిని మించి మరొకరు తిట్టుకుంటూ రచ్చ చేశారు. శోభా శెట్టి ఐతే అందర్నీ మించిపోయి సైకో లాగా ప్రవర్తించింది.ఐతే కెప్టెన్సీ రేస్ లో గెలిచి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ కాబోతున్నాడు గౌతమ్.
ప్రశాంత్, శోభా, ప్రియాంక, సందీప్, గౌతమ్ కెప్టెన్సీ రేసులో ఉండగా గౌతమ్ కెప్టెన్ అయ్యాడు. శివాజీ ఓటు ఇందుకు కీలకంగా మారింది. ఈ టాస్క్ లో మిగిలిన ఇంటి సభ్యులు అనర్హులు అని భావించిన వారి మెడలో మిర్చి దండ వేయాలి అని బిగ్ బాస్ చెప్పారు. ఈ క్రమంలో తేజ,అమర్ లు ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. ఇక యావర్,రతిక శోభా మెడలో దండ వేసేసరికి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంది.
భోలే ఇంకా అశ్విని ప్రియాంక మెడలో మిర్చి దండ వేసి షాక్ ఇచ్చారు. చివరికి సందీప్ ఇంకా గౌతమ్ కెప్టెన్సీ రేస్ లో మిగిలారు. అర్జున్, శివాజి… సందీప్ మెడలో దండ వేసి కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించాడు. దీంతో గౌతమ్ ఇంటి కెప్టెన్ అయ్యాడు.నిజానికి ప్రశాంత్,యావర్ కెప్టెన్ అయ్యారంటే దాని వెనుక శివాజీ చేసిన కృషి చాలా ఉంది. ఇప్పుడు గౌతమ్ కెప్టెన్ అవ్వడానికి కూడా శివాజీ వేసిన ఓటుతో సాధ్యమైంది.
ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో మిర్చి దండ వేసినా ఎవరూ పెద్దగా ప్రతిఘటించ లేదు. శోభా మాత్రం హైడ్రామా క్రియేట్ చేసింది. యావర్ ని ఏకంగా పిచ్చోడు అని పదే పదే పిలిచింది. దాంతో యావర్ సైతం సహనం కోల్పోయాడు. కొట్టుకునే వరకు వెళ్ళింది. శోభా ప్రతి విషయంలో కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తుంది. గౌతమ్ కెప్టెన్ కాగానే మరలా సంబరాలు చేసుకుంటూ అతనికి హగ్ ఇచ్చింది. శోభా గేమ్ వెగటు పుట్టించేలా ఉంది.
రతిక-ప్రశాంత్ మధ్య చిన్న పంచాయితీ జరిగింది.నన్ను అక్క అనొద్దని రతిక పల్లవి ప్రశాంత్ ని రిక్వెస్ట్ చేసింది. గతంలో నువ్వే నన్ను ఇలా అనేలా చేశావు. నా పేరెంట్స్ మీద కూడా నోరు పారేసుకున్నావని ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. అందుకు సారీ. అక్క అనకు, రతిక అను చాలని అంది. ప్రశాంత్ ఒప్పుకోలేదు. నేను అక్కే అంటా అని వెళ్ళిపోయాడు. శివాజీ మధ్యలో దూరి సంధి కుదిర్చాడు. నువ్వు అక్క అనడం తనకు బయట ఇబ్బంది అవుతుందట అని ప్రశాంత్ కి చెప్పాడు. శివాజీ చెప్పడంతో పల్లవి ప్రశాంత్ ఓకే చెప్పాడు.
రతిక గురించి శోభా-అశ్విని మధ్య చిన్న సంభాషణ జరిగింది. అదేంటి రాక్షసిలా తింటుందని అశ్విని శోభాతో అంది. రతిక హౌస్లో తినడం, తిరగడం మాట్లాడటం తప్పా ఏమీ చేయడం లేదని కామెంట్ చేసింది. ఇక నేడు శనివారం కాగా నాగార్జున ఎంట్రీ ఇవ్వనున్నాడు.