Bigg Boss 7 Telugu: ఈసారి బిగ్ బాస్ సీజన్ స్పైసి లెవెల్ కాస్త పెరిగింది అని చెప్పాలి. తిరిగి పాత క్రేజ్ తెచ్చుకోవడానికి తెగ ట్రై చేస్తున్న బిగ్ బాస్ టీం టాస్కులను కూడా ముందంజగానే నిర్వహిస్తోంది. అన్నట్టుగానే ప్రతి ఒక్కటి ఉల్టా పుల్టా చేస్తూ .. కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ మీద షాక్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా నిన్న జరిగిన ఇమ్యూనిటీ టాస్క్ అయితే వేరే లెవెల్ లో టెన్షన్ క్రియేట్ చేసింది.
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ హౌజ్‍లో అందరు
కంటెస్టెంట్స్ ఇమ్యునిటీ టాస్క్ లో తమ బెస్ట్ ఇచ్చారు. అయితే అందరిలో చివరిగా ఇద్దరూ మాత్రమే ఫైనల్‍లోకి వెళ్లారు. వెళ్తే వెళ్లారు గాని.. వెళ్లడం వల్ల పెద్ద బెనిఫిట్ లేదు అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ ఇద్దరిలో ఓడినా .…గెలిచినా …నష్టం వాళ్ళిద్దరికే…
ఇమ్యూనిటీ టాస్క్ గురించి బిగ్ బాస్ ఫాలోవర్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టాస్క్ లో గెలిచిన హౌస్ మేట్ రాబోయే ఐదు వారాలపాటు సేఫ్ జోన్ ఉంటారు. అంటే 5 వారాలు ఇమ్యునిటీ లభించడంతో వీరు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఐదు వారాలపాటు ఎటువంటి నామినేషన్ లేకుండా వీళ్ళు ఇంటి సభ్యులుగా కన్ఫామ్ అయినట్టే లెక్క. అయితే ఇందులో చికెన్ ఏంటి అనుకుంటున్నారా.. సమస్య టాస్క్ వల్ల కాదు టాస్క్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ వల్లే..
మొదట ఫేస్ ది బెస్ట్ టాస్కులో అబ్బాయిల తరఫున ఆట సందీప్ అమ్మాయిల తరఫున ప్రియాంక జైన్.. టాస్క్ కు అర్హత సాధించారు.
ఆ తర్వాత బిగ్బాస్ తనని మెప్పించిన కంటెస్టెంట్స్ గా రతిక, శివాజీ ను బరిలోకి దింపాడు. ఆ తర్వాత ఈ నలుగురిలో ఎవరు కాంపిటీషన్ కి అనర్హులో చెప్పవలసిందిగా మిగిలిన హౌస్ మేట్స్ కోరగా…వాళ్లు ఎక్కువ
రతిక, శివాజీలు నామినేట్ చేశారు.
దీంతో ఇమ్యునిటీ టాస్క్ ఫైనల్‍లోకి కేవలం ఆట సందీప్, ప్రియాంక్ జైన్ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య పవరాస్త్ర టాస్క్ ఉండబోతున్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. కాకపోతే ఈ ఇద్దరి కంటెస్టెంట్స్ కి ఐదు వారాలు సేఫ్ జోన్ అవసరం లేదు. సీరియల్ అభిమానుల ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటి ప్రియాంక జైన్.. ఆమెకు సునాయాసంగా ఓట్లు వేసి మరీ ఫైనల్ వరకు ప్రేక్షకులు చేర్పిస్తారు. ఆట సందీప్ కి కూడా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు మరి…మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్తే వాళ్ల ఫుల్ పర్ఫామెన్స్…అసలైన ఆట చూసే అవకాశం ఉండదు. పైగా ప్రేక్షకులలో వాళ్లకు పెరిగే క్రేజ్ పైన కూడా దీని ప్రభావం పడొచ్చు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఈ టాస్క్ గెలిచినా పెద్దగా ఒరిగేది అయితే ఏమీ లేదు అని రివ్యూవర్స్ చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.