Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 మొట్టమొదటి కెప్టెన్సీ టాస్క్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా శివాజీ -ప్రశాంత్ ,సందీప్ -అమర్ , ప్రియాంక -శోభా,గౌతమ్ -శుభ శ్రీ ,యావర్ -తేజ జంటలుగా మారారు. ఇక వీళ్లకి సమయానుసారంగా టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ రేస్ లో మొదటి రౌండ్ లో శుభశ్రీ – గౌతమ్ ల జట్టు విజయం సాధించింది. మూడు స్టార్స్ సొంతం చేసుకున్నారు. నిజానికి ఇది సంచాలకుల తప్పుడు నిర్ణయం వలన శివాజీ జట్టు కి అన్యాయం జరిగింది.ఫస్ట్ ప్లేస్ లో ఉండాల్సిన వారిని మూడో ప్లేస్ కి తోసేశారు.
రెండో రౌండ్ లో ” దొరికితే దొంగ దొరక్కపోతే దొర ” టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఫ్రెండ్ యాక్టివిటీ రూమ్ లో నిద్రపోతుంటాడు. కంటెస్టెంట్లు దొంగల్లా గదిలోకెళ్ళి బిగ్ బాస్ ఇస్తున్న హింట్స్ ద్వారా వస్తువులను సేకరించి సంచిలో వేసుకోవాలి. బిగ్ బాస్ చెప్పిన వస్తువులు మాత్రమే సేకరించాలని చెప్పాడు. కంటెస్టెంట్స్ దొరికిన వస్తువులు అన్నీ తెచ్చేశారు. ఇది రెండు రౌండ్స్ లో జరిగింది. రెండో రౌండ్ లో శోభా ,సందీప్ లు చీపుర్లు ,డోర్ మేట్ లు దొరికిన వన్నీ ఎత్తుకొచ్చారు. శివాజీ మాత్రం ఒక్క రూమ్ ఫ్రెషనర్ పట్టుకుని వచ్చేసాడు.
టాస్క్ ముగిసింది అందరూ గార్డెన్ ఏరియా లో నిల్చున్నారు.ఇప్పుడే బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఇచ్చాడు.మీకు ఆట అసలు స్వరూపాన్ని మార్చే స్వేచ్ఛ ఏ మాత్రం లేదు. నేను అడగని వస్తువులు ఎన్ని తెచ్చారు లెక్కించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పాడు. దాంతో షాక్ అయ్యారు కంటెస్టెంట్స్. అందరి వస్తువులు లెక్కపెట్టి గౌతమ్ ని నిర్ణయం చెప్పమని అడిగాడు బిగ్ బాస్. అందరికంటే తక్కువ వస్తువులు తెచ్చిన శివాజీ -ప్రశాంత్ ల జట్టు విజయం సాధించారు. మూడు స్టార్స్ పొందారు. రెండో స్థానంలో శోభా -ప్రియాంక కి రెండు స్టార్స్ ,మూడవ స్థానంలో శుభశ్రీ -గౌతమ్ లు ఒక్క స్టార్ పొందారు.
ఇక గురువారం ఎపిసోడ్లో శివాజీ కాఫీ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. బొక్కలోది మైండ్ పనిచేయడం లేదు అంటూ బూతులు తిడుతూ నేను వెళ్ళిపోతా అని అదే రాగం అందుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ మరో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఈసారి ఎమోషన్స్ తో ఆడుకున్నాడు. చిట్టీ ఆయిరే టాస్క్ లో భాగంగా జంటలుగా ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు తమ కుటుంబ సభ్యుల నుండి వచ్చిన లెటర్ త్యాగం చేయాల్సి ఉంటుంది. త్యాగం చేసినవాళ్లు లెటర్ చదవలేరు. అలాగే కెప్టెన్సీ కంటెండర్ రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుంది.
ఈ టాస్క్ కూడా శివాజీకి నచ్చలేదు. మైక్ తీసేసి నేను ఆడను బిగ్ బాస్ అంటూ పక్కకు వెళ్ళిపోయాడు. అతని టీం మేట్ పల్లవి ప్రశాంత్ శివాజీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. నువ్వు ఆడు బిడ్డా. అసలు నేను నిన్నే కెప్టెన్ చేద్దాం అనుకున్నా. నా బిడ్డల మీద ఒట్టు అన్నాడు. బిగ్ బాస్ మాత్రం శివాజీని హెచ్చరించలేదు. టాస్క్ లో పాల్గొనాలని చెప్పలేదు. ఇక శుభశ్రీ-గౌతమ్ లలో శుభశ్రీ త్యాగం చేసింది. గౌతమ్ లెటర్ చదివాడు. ఆమెను నామినేషన్స్ నుండి సేవ్ చేస్తానని హామీ ఇచ్చాడు.
ప్రిన్స్ యావర్-తేజాలలో యావర్ తన లెటర్ త్యాగం చేశాడు. తేజా కెప్టెన్సీ టాస్క్ లో ముందుకు వెళ్ళాడు. ప్రియాంక, శుభశ్రీ టీమ్ తక్కువ స్టార్స్ తో అర్హత కోల్పోయారు. కాబట్టి వాళ్లకు అవకాశం లేదు. పల్లవి ప్రశాంత్-శివాజీ టీమ్ నుండి ఒకరు, సందీప్-అమర్ టీమ్ నుండి మరొకరు కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారు. అంటే నలుగురు నెక్స్ట్ రౌండ్ కి వెళతారు.