Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 చూస్తుండగానే మూడు వారాలు పూర్తయిపోయింది. మూడు వారాలకు గాను ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ కి గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోయారు . ఆ ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ కావడం విశేషం . ఇక నాలుగో వీకెండ్ కూడా వచ్చేసింది . ఇక నిన్న శనివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున తప్పు చేసిన వారిని నిలదీసి బెల్ట్ చూపిస్తూ ఓ రేంజ్ లో ఇచ్చి పడేసాడు . ఎపిసోడ్ లో సరదాలు ,నవ్వులు లాంటివి ఏమీ లేకుండా హాట్ హాట్ గా ముగిసింది .
ఇక ఈ రోజు సండే కావడం తో సండే ఫన్ డే అంటూ హుషారైన స్టెప్పులతో ఎంట్రీ ఇచ్చాడు నాగ్ . కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఇప్పుడు మనం ఒక సింపుల్ ఆట ఆడుదాం ఆట పేరు బొమ్మ గీయి గెస్ చెయ్ అని చెప్పాడు నాగార్జున . కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు బొమ్మలు గీస్తుంటే మిగిలినవారు గెస్ చేసే పనిలో ఉన్నారు . బొమ్మలు చూసి వారికి తోచిన విధంగా ఆన్సర్స్ చెబుతూ ఫన్ జెనరేట్ చేశారు . నవ్వుకుంటూ నాగార్జున ఎంజాయ్ చేసారు . కంటెస్టెంట్స్ కూడా డాన్సులు ,నవ్వులతో మస్తీ మూడ్ లో ఉన్నారు .
ఇదిలా ఉండగా ఈ సీజన్ లో ఎప్పుడు ఎక్కడ జరగనివి జరగబోతున్నాయి ,బీ కేర్ ఫుల్ , రిమెంబర్ థిస్ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ఆడియన్స్ లో సస్పెన్స్ క్రియేట్ చేసాడు నాగార్జున .
ఆదివారం అంటే ఎలిమినేషన్ తప్పదు . ఈ వారం ఇంటి నుండి బయటకు ఎవరు వెళ్తారు అనేది టెన్షన్ పుట్టిస్తున్న విషయం . అందరికంటే తక్కువ ఓట్లు సాధించి చివరి రెండు స్థానాల్లో ఉన్న రతిక ,తేజ. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ,అసలు ఎలిమినేషన్ లేకపోయినా ఆశ్చర్యం లేదు , ఏమైనా జరగొచ్చు . ఈ రోజు ఎపిసోడ్ చుస్తే గాని క్లారిటీ రాదు.
