https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ – అర్జున్ మధ్య తన్నులాట… కావాలనే కొట్టాడంటూ రైతు బిడ్డ ఆవేదన!

టాస్క్ గెలిచిన వారు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో మరో రెండు టాస్కులు బిగ్ బాస్ నిర్వహించారు.

Written By: , Updated On : December 7, 2023 / 04:15 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో ముగుస్తుంది. ఇప్పటికే టైటిల్ రేస్ మొదలవగా కంటెస్టెంట్స్ ఆడియన్స్ తో ఓట్ అప్పీల్ చేసుకునేందుకు బిగ్ బాస్ అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు హౌస్ మేట్స్ తో కొన్ని టాస్కులు ఆడిస్తున్నారు. టాస్క్ గెలిచిన వారు ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో మరో రెండు టాస్కులు బిగ్ బాస్ నిర్వహించారు. ఇక మొదటి టాస్క్ లో భాగంగా ఇసుకతో తయారు చేసిన కేకులు పై చెర్రీ లు పెట్టి .. ఒక కార్డు తో కేక్ పై ఉన్న చెర్రీ పడిపోకుండా .. కేక్ ని కట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పారు.

ఇక కట్ చేసే క్రమంలో చెర్రీ పడిపోతే వాళ్ళు అవుట్ అయినట్టు. ఇందులో అర్జున్, ప్రియాంక, శివాజీ, యావర్ ఓడిపోయినట్లు ప్రోమోలో చూపించారు. ఇక రెండో టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియా లో ఒక గంట పెట్టి .. బజర్ మోగినప్పుడు ఎవరైతే ముందు బెల్ కొడతారో వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు రెండవ కంటెండర్ అవుతారు అని బిగ్ బాస్ తెలిపారు. ఇక బజర్ మోగిన వెంటనే అర్జున్, ప్రశాంత్, యావర్ లు పరుగెత్తారు.

ముగ్గురూ తోసుకుంటూ వెళ్లి గంట మీద పడ్డారు. ముందుగా అర్జున్ బెల్ కొట్టాడు. ఇక ప్రశాంత్ ‘ నన్ను కావాలని దవడ మీద కొట్టి ఆపేశాడు అంటూ సంచాలక్ గా ఉన్న అమర్ కి చెప్పాడు. దీంతో అర్జున్ ‘ నువ్వు సోది చెప్పకు .. వెధవ రీజన్లు చెప్పకు .. ప్రశాంత్ నువ్వు నిన్న నన్ను కూడా ఇలానే ఆపావ్ .. మరి అప్పుడు నేనేమైనా అన్నానా అంటూ ఫైర్ అయ్యాడు.

మధ్యలో ప్రియాంక దూరి .. ఎందుకు పక్కన ఉన్న వాళ్ళను తోస్తారు ..మీ దారిలో మీరు పరిగెత్తొచ్చు కదా అంటూ అరిచింది. ఇక శివాజీ సైలెంట్ గా చూస్తూ నిలబడ్డాడు. ఫన్ గేమ్స్ కూడా సీరియస్ గా ఆడేస్తున్నారు కంటెస్టెంట్స్. ఇక టైటిల్ ఎవరు కొడతారనే ఉత్కంఠ కొనసాగుతుంది. టాప్ లో ప్రశాంత్, శివాజీ ఉన్నట్లు సమాచారం. టైటిల్ కోసం ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమర్, యావర్, అర్జున్, ప్రియాంక, శోభ తర్వాత స్థానాల్లో ఉన్నారట.