Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఐదుగురు సెలెబ్రెటీస్ వైల్డ్ కార్డు ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన వారు పోటుగాళ్ళు గాను, పాత కంటెస్టెంట్స్ ని ఆటగాళ్లు గా విభజించాడు బిగ్ బాస్. ఇక సోమవారం నామినేషన్స్ కూడా రెండు టీమ్స్ మధ్య హోరాహోరీగా జరిగాయి. ఈ రోజు ప్రోమోలో బిగ్ బాస్ ఇరు టీమ్స్ లో ఎవరు గొప్ప అని నిరూపించుకోవాలి అని చెప్పాడు. ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు. మొదటి రౌండ్ లో టైర్స్ ని నంబర్స్ ప్రకారం వరుస క్రమంలో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న పోల్ కి వెయ్యాలి.
రెండు టీమ్స్ కూడా పోటా పోటీగా బరిలోకి దిగి రఫ్ ఆడించేస్తున్నారు. ఇక రెండో రౌండ్ లో ”హూ ఐస్ ది జీనియస్ ” అంటూ మరో గేమ్ పెట్టాడు బిగ్ బాస్.మీ మెదడుకు పదును పెట్టే అట అని చెప్పాడు. గేమ్ లో భాగంగా టీవీ స్క్రీన్ పై కొన్ని బొమ్మలు చూపించి వాటికి సమందించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. ముందుగా ఆటగాళ్ల నుంచి అమర్, పోటుగాళ్ళ లోని గౌతమ్ పాల్గొన్నారు.
ఒక చెట్టు దాని మీద కొన్ని పిట్టలు పక్కనే ఒక గన్ మాన్ ఉన్నాడు. అమర్ గన్ పేల్చిన తర్వాత చెట్టు పైన అన్ని పిట్టలు ఉంటాయి అని ప్రశ్న వేసాడు బిగ్ బాస్.ఏమి ఉండవు అని సమాధానం ఇచ్చాడు. కేక్ చూపించి క్యాలరీస్ గురించి లాజికల్ క్వశ్చన్ వేసాడు. ఏదో పిచ్చి సమాధానం చెప్పాడు అమర్.
అమర్ ని రీప్లేస్ చేసి తేజ గేమ్ లోకి ఎంటర్ అయ్యాడు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న అమ్మాయి పెట్టిన ఫోజ్ చూపించాలని బిగ్ బాస్ కోరాడు. తేజ ఆ పోజ్ పెట్టగానే అందరూ నవ్వుకున్నారు. మరో పిక్చర్ చూపించి ఇందులో ఏ డోర్ తెరవడం కష్టం అని అడిగాడు. తేజ ఏంటో తెగ ఆలోచించి ఏదో చెప్పాడు. నీకు తలుపుల మీద బాగా అవగాహన ఉంది అంటూ బిగ్ బాస్ కౌంటర్ వేశాడు. ఇది అంతా చాలా సరదాగా సాగింది.