https://oktelugu.com/

Bigg Boss Arjun: తండ్రి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్… ఇంతకీ అమ్మాయా అబ్బాయా?

ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. వారిలో అర్జున్ ఒకడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు.

Written By:
  • NARESH
  • , Updated On : January 10, 2024 / 11:18 AM IST

    Bigg Boss Arjun

    Follow us on

    Bigg Boss Arjun: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సురేఖా ప్రసవించింది. ఈ శుభవార్తను అంబటి అర్జున్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సీరియల్ నటుడైన అంబటి అర్జున్ ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా రాణిస్తున్నాడు. అర్జున్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ తెలుగు 7లో అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు.

    ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ఐదుగురు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. వారిలో అర్జున్ ఒకడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. అర్జున్ మాత్రమే ఫైనల్ కి వెళ్ళాడు. అర్జున్ హౌస్లో అడుగుపెట్టే నాటికి భార్య సురేఖ గర్భవతి. 10వ వారం ఫ్యామిలీ వీక్ లో సురేఖ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె గర్భవతి కావడంతో బిగ్ బాస్ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశాడు.

    బిగ్ బాస్ చీర, పూలు, పండ్లు పంపాడు. దాంతో హౌస్లోనే ఆమెకు సీమంతం జరిగింది. అర్జున్ తన భార్యకు సీమంత వేడుక జరగడం చూసి ఎమోషనల్ అయ్యాడు. నువ్వు అగ్రెసివ్ గా ఉండు. ఎమోషన్స్ దాచుకుని కామ్ గా ఉంటుంటే నచ్చడం లేదని సురేఖ సలహా ఇచ్చింది. ఇక బిగ్ బాస్ వేదిక మీదే అర్జున్ తనకు పుట్టబోయే బిడ్డ పేరు ప్రకటించాడు. అర్జున్, సురేఖా పేర్లు కలిసి వచ్చేలా ఆర్కా అని పెట్టాలని నిర్ణయించినట్లు హోస్ట్ నాగార్జునతో చెప్పాడు.

    అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా… పేరు ఆర్కా అన్నాడు. కాగా నిన్న అర్జున్ భార్య సురేఖ ప్రసవించింది. పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. తన ఆనందం మాటల్లో వర్ణించలేనని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అర్జున్ దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.