Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: బిగ్ బాస్ హౌస్ లో దారుణ హత్య… రంగంలోకి దిగిన పోలీసులు!

రోజూ చప్పిడి కూరలు తింటున్న హౌస్ మేట్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. చికెన్ బిర్యానీతో గ్రాండ్ గా లంచ్ పార్టీ ఏర్పాటు చేశాడు. కాగా అర్జున్, అమర్ దీప్ మినహా మిగిలిన వాళ్ళంతా యాక్టివిటీ రూంలో కి రావాలని బిగ్ బాస్ చెప్పారు.

Written By: NARESH, Updated On : November 22, 2023 10:23 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: మంగళవారం ఎపిసోడ్ అనేక ఆసక్తికర పరిణామాలతో సాగింది. నామినేషన్స్ ప్రక్రియ ముగియగా… శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్, యావర్, అశ్విని, గౌతమ్, రతిక, అర్జున్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. తర్వాత ఎవిక్షన్ పాస్ కోసం పోటీ జరిగింది. 10 మంది హౌస్ మేట్స్ ఒకేసారి ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఎక్కువ సేపు ప్లేట్స్ బ్యాలెన్స్ చేసిన ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. ఇంటి సభ్యులు ప్రశాంత్ ని అభినందించారు.

రోజూ చప్పిడి కూరలు తింటున్న హౌస్ మేట్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. చికెన్ బిర్యానీతో గ్రాండ్ గా లంచ్ పార్టీ ఏర్పాటు చేశాడు. కాగా అర్జున్, అమర్ దీప్ మినహా మిగిలిన వాళ్ళంతా యాక్టివిటీ రూంలో కి రావాలని బిగ్ బాస్ చెప్పారు. లోపలికి వెళ్ళేసరికి అదిరిపోయే విందు ఏర్పాటు చేశాడు. మిసెస్ బిగ్ బాస్ .. మీ అందరి కోసం లంచ్ ఏర్పాటు చేసింది. ఇక తినండి అని బిగ్ బాస్ చెప్పడంతో.. ‘ పెద్దయ్యా ఇందులో పేచీ ఏం లేదు కదా .. అని అడిగింది రతిక.

అర్జున్, అమర్ దీప్ మీ ఇద్దరిని మినహాయించి మిగిలిన వారిని యాక్టివిటీ రూంకి ఎందుకు పిలిచానని ఆలోచిస్తున్నారా .. అందుకు ఒక కారణం ఉంది అని బిగ్ బాస్ చెప్పాడు. తినడం వలన ఏదైనా ఇబ్బంది ఉందా అని రతిక బిర్యానీ తినడానికి సంశయిస్తుంది. రతిక మీరు ఓవర్ థింకింగ్ ఇంకా ఆపలేదా అంటూ బిగ్ బాస్ జోక్ వేశారు. ఇక బిగ్ బాస్ పంపిన బిర్యానీ తిన్నారు హౌస్ మేట్స్. ఇంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో దారుణమైన హత్య జరిగింది. చనిపోయింది ఎవరో కాదు మిసెస్ బిగ్ బాస్ అంటూ షాక్ ఇచ్చాడు. ఆ నేరస్థుడిని పట్టుకోవడానికి అర్జున్, అమర్ దీప్ పోలీస్ గెటప్ లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు.

వాళ్ళని చూసి నిజంగానే పోలీసులు అనుకోని ప్రశాంత్ డోర్ తీసి భయపడి పరుగెత్త బోయాడు. ఖిల్ ఖిల్ ఖిల్ .. ఖిలాడీ అంటూ బ్యాక్ రౌండ్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు అర్జున్, అమర్ దీప్. అయితే కంటెస్టెంట్స్ ఊహించిన విధంగానే కడుపు నిండా తిండి తిండి పెట్టి .. ఇంతలోనే దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఈ టాస్క్ సారాంశం ఏమిటో తెలియదు. కేవలం ఎంటర్టైన్మెంట్ లో భాగం అని తెలుస్తుంది. ఇలా ఎపిసోడ్ ముగిసింది.