Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్స్ హౌస్ ను హీటెక్కిస్తున్నాయి. ఈ వీక్ కొంచెం కొత్తగా ,ట్విస్టింగ్ అనిపిస్తున్నాయి . ఇందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలి అనుకున్న ఇద్దరు సభ్యుల కు తగిన కారణాలు చెప్పి జ్యూరీ సభ్యులను ఒప్పించగలిగితేనే వారు నామినేట్ అవుతారని కండిషన్ పెట్టాడు . జ్యూరీ సభ్యులుగా సందీప్ ,శివాజీ , శోభా శెట్టి లను నియమించాడు.
ఇక జ్యూరీ సభ్యుడు శివాజీ చాలా ఓవర్ చేసాడు . ఎవరు చెప్పేది వినిపించుకోకుండా ,వారి మాటలు లెక్కచేయకుండా,తానే గొప్ప అని,తను చెప్పింది వేదం అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. తన మాటే శాసనం అన్నట్టు అతి చేస్తున్నాడు. గౌతమ్ తో చాలా దురుసుగా ప్రవర్తించాడు శివాజీ . నువ్వు చెప్పినవన్నీ పిచ్చి కారణాలు ,ప్రిన్స్ ప్రవర్తన దురుసుగా ఉండటం వల్ల అతడిని నామినేట్ చేశాము అంటూ చులకనగా మాట్లాడాడు. గౌతమ్ మీరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అంటూ శివాజీ పై ఫైర్ అయ్యాడు .
రతిక ఛీ ఈయన మనిషా లేక ఏమైనా , ఈయన్న నేను సపోర్ట్ చేసింది . అందరితో బాగున్నట్టు నటిస్తూ ,అందరూ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ ఆయన మంచిగా నటిస్తూ మార్కులు కొట్టేస్తున్నాడు . మనందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడు . నేను ప్రశాంత్ వెనుక తిరుగుతున్నాను అని శివాజీ నాగార్జున తో చెప్పడం నాకు నచ్చలేదు అని తన భాద ని వెళ్లగక్కింది రతిక రోజ్ .
ఇంకా నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇవాళ కూడా కొనసాగనుంది. జ్యూరీ సభ్యులుగా ఉన్న శివాజీ, శోభా శెట్టి, ఆట సందీప్ సేఫ్. మిగిలిన 8 మందిలో ఎవరు నామినేట్ అవుతారో చూడాలి. నామినేషన్ ప్రక్రియలో తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కంటెస్టెంట్స్ కోపాలు హద్దులు దాటేస్తున్నాయి.