Bigg Boss Telugu 6 Elimination Week 2: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ పై హోస్ట్ నాగార్జున పూర్తి నిరాశ వ్యక్తం చేశారు. ముఖ్యంగా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు. తినడానికి పడుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారా? అంటూ ఫైర్ అయ్యాడు. నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాక రేపుతోంది. కంటెస్టెంట్స్ బాలాదిత్య, షాని, సుదీప, వాసంతి, శ్రీ సత్య, కీర్తి, రాహుల్-మెరీనా, అభినయశ్రీ, శ్రీహాన్… హౌస్ లో గేమ్ ఆడటం లేదని నాగార్జున మండిపడ్డారు. ఒక్కొక్కరిగా క్లాస్ పీకుతూ వాళ్ళ ఫోటోలు అంటించి ఉన్న కుండలు బ్రేక్ చేశాడు.

బాల ఆదిత్యను నువ్వు ఆడకుండా ఇతరుల ఆట కూడా చెడగొడుతున్నావ్ అన్నారు. ఇక అభినయశ్రీ గేమ్ జీరో అన్నాడు. శ్రీ సత్యకు భోజనం ప్లేటు మీదున్న శ్రద్ధ ఆట మీద లేదన్నాడు. కపుల్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన రోహిత్-మెరీనాలకు కూడా నాగార్జున క్లాస్ పీకారు. నాగార్జున చెప్పిన ఆ తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లో ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక నాగార్జున పేల్చిన మరో బాంబు ఏంటంటే… ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందన్నారు. ఎలిమినేషన్ కి ఎనిమిది సభ్యులు నామినేట్ కాగా వీరిలో ఇద్దరు హౌస్ నుండి వెళ్ళిపోతారని చెప్పారు.
2వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. షాని, గీతూ రాయల్, ఆదిరెడ్డి, రోహిత్-మెరీనా, అభినయశ్రీ, రేవంత్, ఫైమా, రాజ్ నామినేట్ అయ్యారు. నాగార్జున చెప్పింది నిజమైతే వీరి నుండి ఆదివారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నారు. మొదటి వారం ఇనయ సుల్తానా, అభినయశ్రీలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఇద్దరినీ సేవ్ చేసి ఒక అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చినట్లు ఉన్నారు.

రెండో వారం కూడా అభినయశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. గేమ్ పరంగా కూడా ఏమాత్రం ఆకట్టుకొని అభినయశ్రీని బిగ్ బాస్ ప్రేక్షకులు ఇంటికి పంపడం ఖాయంగా కనిపిస్తుంది. మరి అభినయశ్రీతో పాటు ఇంటిని వీడే మరో కంటెస్టెంట్ ఎవరనేది ఆసక్తికరం. మొత్తంగా నేటి ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తాడనిపిస్తుంది.
https://twitter.com/StarMaa/status/1571110537869791232