Srihan: బిగ్ బాస్ సీసన్ 6 తొమ్మిదవ వారం కెప్టెన్ గా శ్రీహాన్ నిలిచాడు..కెప్టెన్సీ టాస్కులో చివరికి ముగ్గురు కంటెండర్లు గా మిగిలితే ఆ ముగ్గురిలో ఇంటి సభ్యుల వోటింగ్ ద్వారా శ్రీహాన్ ఈ వారం కెప్టెన్ అయ్యాడు..కెప్టెన్ అవ్వగానే శ్రీహన్ ఇంట్లో మార్పులు చెయ్యడానికి తన మార్కుని చూపే ప్రయత్నం చేసాడు..ముందుగా ఫుడ్ విషయం లో రేషన్ మేనేజర్ గా రేవంత్ ని పెట్టుకున్నాడు..అలాగే ఫుడ్ వేస్ట్ అవుతున్న విషయం లో ఇంటి సభ్యులను కాస్త గట్టిగానే మందలించాడు.

నా కెప్టెన్సీ లో ఫుడ్ వేస్ట్ అయితే అసలు ఊరుకునేది లేదు..అసలు ఇంట్లో ఉన్న ఫుడ్ సరిపోక అందరూ ఏడుస్తుంటే , చేతికి అందిన ఫుడ్ ని కొంతమంది కావాలని వేస్ట్ చేస్తున్నారు..దయచేసి ఎవరికైనా రైస్ ఎక్కువ అయిపోతుంది అనిపిస్తే ఎంత అయితే వేసుకోవాలో అంతే వేసుకోండి..వేస్ట్ చెయ్యకండి..ఈరోజు రోహిత్ కి రైస్ సరిపోలేదు..అలా భవిష్యత్తులో ఎవరికీ జరగకూడదు అని చెప్తాడు..ఫుడ్ విషయం లో శ్రీహాన్ మాట్లాడిన ఈ మాటలకు మంచి మార్కులే పడ్డాయి.
కానీ శ్రీహాన్ ఫుడ్ విషయం లో మంచి కెప్టెన్ అని అనిపించుకున్నప్పటికీ..బాలాదిత్య విషయం లో మాత్రం అన్యాయం చేసాడు..ప్రతి వారం లో లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్కులో ‘వరస్ట్ కంటెస్టెంట్’ ఎవరో బిగ్ బాస్ కి తెలిపి జైలుకు పంపండి అని ఆ బాధ్యతని కెప్టెన్ శ్రీహాన్ కి ఇచ్చాడు..శ్రీహాన్ బాలాదిత్య ని నామినేట్ చేసి జైలుకి పంపుతాడు..ఇది హౌస్ మేట్స్ లోనే కాస్త ఇబ్బంది కలిగించింది..వరస్ట్ కంటెస్టెంట్ గా బాలాదిత్య ని నామినేట్ చెయ్యడానికి గల కారణం శ్రీహాన్ చెప్తూ ‘మీరు ఈ వారం అందరి కంటెస్టెంట్స్ లాగానే బాగా ఆడారు..కానీ ఒక విషయం నాకు నచ్చలేదు..మీరు ఒకరిని గెలిపించడానికి టాస్కు ఆడినట్టు అనిపించింది..మీరు ఎంతో కష్టపడినా సంపాదించిన చేపని సూర్య కి ఎందుకు ఇచ్చారు’ అని అడగగా.

అప్పుడు బాలాదిత్య దానికి సమాధానం చెప్తూ ‘ఆ చేపని అలా దక్కించుకోమని ప్లాన్ చెప్పిందే సూర్య..అందుకే అతనికి ఇచ్చాను..అది నా గేమ్’ అంటూ సమాధానం ఇస్తాడు..ఇక బాలాదిత్య ని జైలుకు పంపిన తర్వాత జీతూ శ్రీహాన్ ని వ్యక్తిగతంగా పిలిచి ‘బాలాదిత్య ని అన్యాయంగా జైలుకు పంపావు అని అనిపించింది..రేవంత్ నీకు చాలా చేపలు ఇచ్చాడు కదా..నువ్వు కూడా రేవంత్ కి చాలా చెప్పాలి ఇచ్చావు..మీ ఇద్దరి విషయం లో తప్పు కాదు అనిపించినప్పుడు , బాలాదిత్య విషయం లో ఎందుకు తప్పు అనిపించింది’ అని గీతూ అడుగుతుంది..దానికి శ్రీహాన్ సమాధానం చెప్పే ప్రయత్నం చేసాడు కానీ..అది అంగీకారంగా లేదు..అలా శ్రీహాన్ కెప్టెన్ అయినా మొదటి రోజే తప్పటడుగు వేసాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.