Bigg Boss 6 Telugu- Rohit: నిన్నగాక మొన్న ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 అప్పుడే చివరి దసకి చేరుకుంది..21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్స్ కి చేరుకుంది.. గత వారం రోహిత్ భార్య మరీనా ఎలిమినేట్ అవ్వగా ఇప్పుడు రోహిత్, రేవంత్, శ్రీహన్, ఆది రెడ్డి, రాజ్, ఐనాయా, శ్రీ సత్య, ఫైమా, కీర్తి మిగిలారు.. వీరిలో ఇప్పుడు టాప్ 5 గా ఎవరు నిలుస్తారు, బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలవబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లోనే తేలబోతుంది.. ఇది ఇలా ఉండగా హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ తో పాటు, గత సీజన్ కంటెస్టెంట్స్ ఎవరికీ సాధ్యపడని అరుదైన రికార్డు ని రోహిత్ నెలకొల్పాడు.

ప్రారంభంలో చాలా లౌ ప్రొఫైల్ ప్రారంభమైన రోహిత్ గ్రాఫ్, వారాలు గడిచేకొద్ది తన ఆటతీరుని మార్చుకొని టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిపోయాడు..రోహిత్ కి తన భార్య తో కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అరుదైన అవకాశం రావడమే కాకుండా.. మొదట్లో బిగ్ బాస్ ఇద్దరినీ కలిసి ఆడే అదృష్టం ని కలిపించాడు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరినీ విడదీసి ఎవరి ఆటని వాళ్ళు ఆడేలా చేసాడు..ఇప్పుడు మరీనా ఎలిమినేట్ అవ్వడం తో ఆమె లేకుండా ఒంటరిగా గా ఆడబోతున్నాడు.. ఇలా జంట గా కలిసి వచ్చి మూడు డిఫరెంట్ మోడ్ లో గేమ్స్ ఆడిన అరుదైన కంటెస్టెంట్ గా రోహిత్ సరికొత్త రికార్డుని నెలకొల్పాడు..బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్ – రితికా జంటగానే హౌస్ లోకి అడుగుపెట్టారు.. కానీ వాళ్ళిద్దరికీ బిగ్ బాస్ మొదటి రోజు నుండి సెపెరేట్ గానే ఆట ఆడించారు.. ఇలా మూడు రకాలుగా అయితే వాళ్ళిద్దరినీ ఆడించలేదు.

ఇక రోహిత్ మిగిలిన నాలుగు వారాలు ఒంటరిగా ఎలా ఆడబోతున్నాడో చూడాలి.. రోహిత్ ఎంటర్టైన్మెంట్ లో వీక్ అయ్యినప్పటికి కూడా ఫిజికల్ టాస్కులు ఆడడం లో మాత్రం ఇంటి సభ్యులందరికి చాలా గట్టి పోటీ ఇస్తాడు.. ఇన్ని రోజులు ఆట లో తన భార్య మరీనా తనకి ఎంత బలంగా ఉన్నిందొ.. అతనికి బలహీనత గా కూడా ఆమె మారింది.. ఈమెని ఇంటి నుండి పంపిస్తే రోహిత్ తన ఆటని సంపూర్ణంగా ఆడుతాడని రోహిత్ ని అభిమానించే వాళ్ళు అంటూ ఉంటారు..ఇప్పుడు వాళ్ళ కోరిక తీరింది.. రోహిత్ తన ఆటని మరింత మెరుగుపర్చుకొని టాప్ 5 లోకి ఎంటర్ అవుతాడో లేదో చూడాలి.

