Bigg Boss 6 Telugu- Revanth: టాప్ సెలబ్రిటీ అయితే చాలు. ఆటతీరుతో మాట తీరుతో సంబంధం లేకుండా షోలో నిర్వాహకులు కొనసాగిస్తారు. వీళ్లు షోకి వచ్చే ముందే అగ్రిమెంట్ చేసుకుంటారనే వాదన ఉంది. కనీసం ఇన్ని వారాలు, ఇంత రెమ్యూనరేషన్ అనే ఒప్పందంపై హౌస్లోకి వస్తారట. బిగ్ బాస్ సీజన్ 6 టాప్ సెలబ్రిటీ హోదాలో హౌస్లోకి వచ్చిన రేవంత్ మొదటి నుండి తన పొగరు, అహంకారం చూపిస్తున్నాడు. అతని మాటలు చేష్టలు ఇతరులను కించపరిచేవిగా ఉంటున్నాయి. నా ముందు మీరు నథింగ్ అని నేరుగానే రేవంత్ అంటాడు. హౌస్లో తన మాట చెల్లాలి అనే మనస్తత్వం. అన్నిటికీ మించి ఆడవాళ్లు అని కూడా చూడకుండా గేమ్లో తోయడం, నెట్టడం లాంటివి చేస్తున్నాడు.

కావాలని ఇతర కంటెస్టెంట్స్ గాయపరిచే గుణమున్న రేవంత్… పొరపాటున ఇతరుల చేయి తగిలి కొంచెం నొప్పి కలిగినా ఓర్చుకోలేడు. కోపం వస్తే నోటికి వచ్చింది అనేస్తాడు. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో రేవంత్ ప్రవర్తన శృతి మించింది. గేమ్ లో భాగంగా తన భుజాలపై ఉన్న స్ట్రిప్స్ ప్రత్యర్థి టీమ్ సభ్యులు లాక్కోడానికి ట్రై చేస్తుంటే వాళ్ళను కొడుతున్నాడు. గాయపరచడం గేమ్ కాదని ఆదిరెడ్డి ఒకటి రెండు సార్లు చెప్పినా అదే ప్రవర్తన.
ఇదే గేమ్ లో ఆదిరెడ్డితో పాటు అతని టీం సభ్యులను నా కొడకల్లారా అని తిట్టాడు. ఇవాళ ఎపిసోడ్లో రోహిత్ ని ”నీ యమ్మా” అన్నాడు. భర్తను బూతులు తిట్టడం మెరీనాకు నచ్చలేదు. వెంటనే రియాక్ట్ అయ్యింది. రేవంత్ నేను నీ యమ్మా, అని అనలేదని అబద్ధం ఆడాడు. హోస్ట్ నాగార్జున ఒకటి రెండు సార్లు ఇదే విషయమై వార్నింగ్ ఇచ్చాడు. అయినా రేవంత్ కొంచెం కూడా మారలేదు. అతడు అదే కోపాన్ని ప్రదర్శిస్తూ ఇతరులు గేమ్ ఆడాలంటే భయపడేలా చేస్తున్నాడు.

రేవంత్ కాకుండా మరొక కంటెస్టెంట్ ఇలా చేస్తే ఎప్పుడో బయటకు పంపేవారు. కానీ రేవంత్ ని టోలరేట్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణంగా రేవంత్ ప్రవర్తించినా అతడు బయటకు వెళ్ళడు. ఈ ధైర్యమే రేవంత్ తలబిరుసుకు కారణం అవుతుంది. ఆడియన్స్ సైతం రేవంత్ ప్రవర్తనకు విస్తుపోతున్నారు. ఒక స్టార్ సింగర్ కి ఉండాల్సిన లక్షణాలు రేవంత్ లో అసలు కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఉన్న ఇమేజ్ పోయి, రేవంత్ నిజ స్వరూపం ఇదా అని ఆగ్రహిస్తున్నారు. ఈ షో ముగిసే లోపు రేవంత్ ఇంకెన్ని దారుణాలు చూపించనున్నాడో.