Revanth – Sri Satya: బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..నిన్న బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం ఎంత వాడావేడిగా జరిగిందో మన అందరికి తెలిసిందే..ఇక ఈరోజు ‘టికెట్ 2 గ్రాండ్ ఫినాలే’ టాస్కు రసవత్తరం గా సాగింది..ఈ టాస్కు కి సంచలాక్ గా రేవంత్ వ్యవహరించాడు..ఈ టాస్కు లో భాగంగా ఇంటి సభ్యులందరు స్టోర్ రూమ్ లో మంచు మనిషి భాగాలను కలెక్ట్ చేసుకొని మంచు మనిషిని నిర్మించాల్సి ఉంటుంది..కేవలం నిర్మించడం మాత్రమే కాదు..ఇంటి సభ్యుల నుండి తాము నిర్మించిన మంచు మనిషి బొమ్మని కాపాడుకోవాలి కూడా.

ఇది కేవలం మొదటి రౌండ్ మాత్రమే..ఈ వారం మొత్తం ‘టికెట్ 2 గ్రాండ్ ఫినాలే’ టాస్కు కొనసాగుతుంది..ఈ టాస్కు లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నేరుగా గ్రాండ్ ఫినాలే కి చేరుకుంటారు..కాబట్టి ఈ టాస్కు ఇంటి సభ్యులందరికి అపూర్వమైన అవకాశం కావడం తో హోరాహోరీగా నువ్వా నేనా అనే రేంజ్ లో ఈ టాస్కులో తలపడ్డారు.
అయితే ఈ టాస్కు లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న రేవంత్ మరియు శ్రీ సత్య మధ్య చిన్నపాటి గొడవ జరిగింది..ముందుగా శ్రీ సత్య విరిగిపోయిన మంచు మనిషి భాగం ని రెండుగా కలిపి బొమ్మ ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది..అప్పుడు సంచాలక్ గా వ్యవహరిస్తున్న రేవంత్ ‘సత్య అది కౌంట్ చెయ్యను చూసుకో’ అని వార్నింగ్ ఇస్తాడు..అప్పుడు శ్రీ సత్య మాట్లాడుతూ ‘అక్కడ నేను అతికించినట్టు ఏమైనా కనిపిస్తుందా’ అని రేవంత్ ని అడుగుతుంది..’కౌంట్ చెయ్యకపోతే నీ ఇష్టం..నేను అటించుకుంటున్న కదా’ అని అంటుంది శ్రీ సత్య..అప్పుడు శ్రీ సత్య ఫైమా భాగాలను ఒకరికొకరు పంచుకుంటుండగా ‘అలా ఇచ్చుకోవడాలు లేవు’ అని అంటాడు రేవంత్.

ఈ విషయం లో వీళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతుంది..ఆ తర్వాత బిగ్ బాస్ ఈ రౌండ్ లో క్వాలిఫై కానీ కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ కి చెప్పి టాస్కు నుండి తొలగించమని చెప్తాడు..అప్పుడు రేవంత్ శ్రీ సత్య ని టాస్కు నుండి తొలగించేస్తాడు..ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.
