Anchor Suma- Rajamouli: న్యాచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ లో విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన హిట్ అనే చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా అడవి శేష్ ని హీరో గా పెట్టి హిట్ 2 అనే చిత్రాన్ని నిర్మించాడు హీరో నాని..ఇప్పటి వరుకు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

వచ్చే నెల 2 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు..ఈ ఈవెంట్ లో న్యాచురల్ స్టార్ నాని తో పాటు హిట్ 2 కాస్ట్ మొత్తం రాజమౌళి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం సరదాగా జోకులతో సాగిపోయింది..ముందుగా సుమ రాజమౌళి తో మట్కాడుతూ ‘మహేష్ బాబు తో సినిమా ఎప్పుడు..#RRR 2 ఎప్పుడు’ అని అడగగా..రాజమౌళి దానికి సమాధానం చెప్తూ ‘ఆ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి నువ్వే యాంకర్ గా చెయ్యాలి’ అంటాడు..అప్పుడు సుమా రాజమౌళి మీద సెటైర్లు వేస్తూ ఈ రెండు సినిమాలు పూర్తయ్యి విడుదల అయ్యేలోపు నాకు మోకాళ్ళ నొప్పులు రాకుంటే చాలు అని అంటుంది..ఇక ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ ‘అమెరికా జపాన్ లో ఇంగ్లీష్ మాట్లాడి బాగా విసిగెత్తిపోయిన నాకు ఇప్పుడు తెలుగు మాట్లాడే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది..హిట్ సినిమాకి ఫ్రాంచైజ్ తియ్యొచ్చు అనే ఆలోచన వచ్చిన నాని , మరియు శైలేష్ కి కంగ్రాట్స్ చెప్తున్నాను.

ఈ ఫ్రాంచైజ్ కి సెపెరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు..టీజర్ మరియు ట్రైలర్ చూస్తుంటే నటీనటలు పెర్ఫార్మన్స్ అదిరిపోయింది అనిపిస్తుంది..అంతే కాకుండా హిట్ 2 లో అడవి శేష్ నటించడం ఈ చిత్రం పై మరింత ఆసక్తిని రేకెత్తించేలా చేసింది..కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను’ అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు.