Bigg Boss 6 Telugu- Surya vs Inaya Sultana: నిన్న గాక మొన్న మొదలైనట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీసన్ 6 అప్పుడే 7 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 8 వ వారం లోకి అడుగుపెట్టేసింది..గత వారం ఎవ్వరు ఊహించని విధంగా అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసిన విషయం..ఇప్పటికి దీని గురించి సోషల్ మీడియా లో విమర్శలు వస్తూనే ఉన్నాయి..ఈ ఒక్క ఎలిమినేషన్ బిగ్ బాస్ గేమ్ మీద ప్రేక్షకుల్లో నమ్మకాన్ని పోగొట్టేలా చేసింది.

ఇక ఈ వారం నామినేషన్స్ చాలా హీట్ వాతావరణం మధ్య జరిగింది..ఇంటి సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదాల నడుమ ఈ నామినేషన్స్ ఆసక్తికరంగా సాగింది..నామినేషన్స్ ఎవరరెవరు ఉన్నారంటే ఇనాయ సుల్తానా, శ్రీ హాన్ , రేవంత్ , గీతూ , ఆదిత్య , రోహిత్ ,మెరీనా, వాసంతి, శ్రీ సత్య , సూర్య, రాజ్ శేఖర్, కీర్తి , ఫైమా, ఆది రెడ్డి ఇలా హౌస్ లో ఉన్న అందరూ ఇంటి సభ్యులు నామినేషన్స్ లోకి వచ్చేసారు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో మనం ప్రదానం గా మాట్లాడుకోవాల్సింది ఇనాయ సుల్తానా మరియు సూర్య నామినేషన్స్ గురుంచి..ముందుగా సూర్య ఇనాయ ని నామినేట్ చేస్తూ ‘మొన్న నాగార్జున గారు పెట్టిన టాస్కు లో నువ్వు నన్ను సేఫ్ గేమర్ అన్నావు..7 వారాలుగా నాలో నీకు కనపడని సేఫ్ గేమ్..ఇప్పుడు ఎందుకు కనిపించింది’ అంటూ నామినేట్ చేసాడు..అప్పుడు ఇనాయ సుల్తానా మాట్లాడుతూ ‘అవును..నువ్వు నిజంగానే సేఫ్ గేమర్..అందరికి సోప్ ఇస్తావ్ నిన్ను నువ్వు కాపాడుకోవడానికి’ అని అంటుంది..అప్పుడు సూర్య మాట్లాడుతూ ‘ఏంటి నేను సోప్ వేస్తున్నానా..ఇక్కడున్న వాళ్ళతో ఒక్కరితో ఆ మాట చెప్పించు చూద్దాం’ అని అంటాడు..అప్పుడు ఇనాయ దానికి సమాధానం ఇస్తూ ‘ఒకరిని అదిగాల్సిన అవసరం నాకు లేదు..నువ్వు ముమ్మాటికీ సేఫ్ గేమర్ వి..నామినేషన్స్ కూడా నీవి తేన పూసి కత్తితో పొడిచినట్టు అనిపిస్తాది’ అంటూ చెప్పుకొస్తుంది ఇనాయ.

ఇక ఆ తర్వాత ఆమె వంతు వచ్చినప్పుడు సూర్య ని నామినేట్ చేస్తూ ‘నువ్వు అంటే నాకు ఇష్టమే..కానీ నీకు బయట బుజ్జెమా ఉంది అని తెలిసి కూడా మనం అలా ఉండడం కరెక్ట్ కాదు..నాగార్జున గారు కూడా అలా మన మధ్య ఎదో ఉన్నట్టు మాట్లాడడం బయట ఆ అమ్మాయి కి ఎలా అనిపిస్తుందో’ అంటూ ఇనాయ సుల్తానా నామినేట్ చేస్తుంది..అలా క్లోజ్ గా ఉండే వీళ్లిద్దరు ఈ వారం ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం ఈ నామినేషన్స్ లో బాగా హైలైట్ కాబడిన అంశం.