Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ప్రేక్షకుల కంట్లో పడాలని నానా పాట్లు పడుతూ ఉంటారు. పొట్టి బట్టలు ధరించడం, అనవసరంగా గొడవలు పడడం, తమని తాము తెలివైన వాళ్ళగా నిరూపించుకోవడం, జోక్స్ తో ఎంటర్టైనర్ చెయ్యడం… ఇలా అనేక ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. వీటన్నిటి కంటే లవ్ ఎఫైర్ సక్సెస్ ఫార్ములాగా ఉంది.హౌస్ లో ప్రేమ జంటలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. హిస్టరీ పరిశీలిస్తే ప్రేమ జంటలుగా పేరు తెచ్చుకున్న వారు ఎలాంటి ఢోకా లేకుండా ఫైనల్ వరకూ వెళ్లిపోయారు. టైటిల్ సంగతి తర్వాత… ముందు ఎక్కువ వారాలు హౌస్ లో ఉండి భారీగా రెమ్యూనరేషన్ ఎత్తుకుపోవచ్చనేది కంటెస్టెంట్స్ ఎత్తుగడ.

కానీ ఈ సీజన్లో విచిత్ర పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. పెళ్ళైన రోహిత్ వెనుకబడుతుంది సత్యశ్రీ. హౌస్లోకి సతీసమేతంగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ తో సత్యశ్రీ క్లోజ్ గా ఉంటుంది. అతడు కూడా ఆమెతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఇది భార్య మారినా కు మండేలా చేస్తుంది. హౌస్లో ఉన్న అందమైన అమ్మాయిల్లో ఎవరో ఒకరు రోహిత్ ని లైన్ లో పెడతారని మారిన భయపడుతుంది. హైట్, చక్కని రూపం కలిగిన రోహిత్ పట్ల అమ్మాయిలు ఆకర్షించబడటం సహజం. ఈ పరిణామమే మారిన కు నచ్చడం లేదు. ఆ అసహనంతో భర్తతో గొడవలు పడుతుంది.
వారం కూడా ముగియకుండా ఈ జంట మధ్య గిల్లికజ్జాలు మొదలయ్యాయి. తన మాట వినకుండా బాడీ చూసుకుంటున్నాడన్న కారణంతో మారిన అలిగి వెళ్ళిపోయింది. మారిన అలా వెళ్ళిపోయినందుకు రోహిత్ అసహనం ఫీల్ అయ్యాడు. ఇక సత్యశ్రీ తన భర్త రోహిత్ తో క్లోజ్ గా ఉంటుందని మారిన ఓర్చుకోలేకపోయింది. ఫైనల్ గా ఆమె బరస్ట్ అయ్యింది. నా మొగుడు నాకు టైం కేటాయించడం లేదని నేను బాధపడుతుంటే మధ్యలో నీ లొల్లి ఏంటని మారిన కంటెస్టెంట్ సత్యశ్రీతో గొడవ పడింది. రోహిత్ కి దగ్గర కావద్దంటూ మారిన సత్యశ్రీకి ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది.

ఇదేదో సవతుల పంచాయితీని తలపించింది. రానున్న రోజుల్లో ఈ తరహా గొడవలు ఎన్ని జరగనున్నాయోనన్న సందేహాలు కలిగించింది. అయితే ఇదంతా జస్ట్ ప్రాంక్ అని చెప్పి మారిన, సత్యశ్రీ షాక్ ఇచ్చారు. కానీ మారిన ఎమోషన్, ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజమే అనిపించింది. తాను లావైపోయానని బాధపడుతున్న మారిన, భర్త వేరే అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతాడనే అభద్రతా భావం ఫీలవుతోంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఫైట్స్ ఎన్ని చూడాలో మరి.