Nagarjuna- Geetu: ఈ వారం బిగ్ బాస్ షో లో కెప్టెన్సీ టాస్కు ఎంత ఆసక్తికరంగా సాగిందో మన అందరికి తెలిసిందే..టాస్కులో కొంతమంది అతి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు..ఈ సీజన్లో అతి చేసే కంటెస్టెంట్ ఎవరు అంటే తడుముకోకుండా మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు గీతూ..హౌస్ లో ఆమె ఒక్కటే ఆడుతుంది..ఆమె ఒక్కటే అందరిని ఆడిస్తుంది అనే ఊహలో తేలుతూ ఉంటుంది ఆమె..ఈ వారం లో జరిగిన ‘చేపల చెరువు’ టాస్కులో అందరి కంటే తక్కువ చేపలను పట్టుకొని గేమ్ నుండి వైదొలగింది.

తన గేమ్ తానూ ఆదుకోవడం చేతకాదు కానీ..పక్కనోళ్ళని ఆడిస్తా అనే రేంజ్ ధోరణి తో ఈ వారం ఆమె నడుచుకున్న తీరు ఇంటి సబ్యులకు మాత్రమే కాదు..చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు వేసింది..ఈమెకి ఈ వీకెండ్ లో నాగార్జున గారి దగ్గర నుండి ఫుల్ కోటింగ్ ఉంటె బాగుంటుంది అని అందరూ ఎంతగానో ఎదురు చూసారు..అలా ఎదురు చూసిన ప్రేక్షకులకు గత కొద్దిసేపటి క్రితం స్టార్ మా విడుదల చేసిన ప్రోమో మంచి కిక్ ని ఇచ్చింది.
ముందుగా నాగార్జున గారు ఆదిరెడ్డి తో మాట్లాడుతూ ‘మీ పార్టనర్ గీతూ ఈ వారం ఫిజికల్ టాస్కు ఇస్తే అందరిని గుడ్డిపారేస్తా అని చెప్పింది..గుడ్డిపారేసిందా?’ అని అడుగుతాడు..అప్పుడు గీతూ దానికి సమాధానం చెప్తూ ‘గుద్ది పారేసా సార్’ అంటుంది..అప్పుడు చిర్రెత్తిపోయిన నాగార్జున గారు ‘నేను నిన్ను అడగలేదు గీతూ’ అంటూ సీరియస్ గా వేలు చూపిస్తాడు..అప్పుడు ఆది రెడ్డి మాట్లాడుతూ ‘బాగానే ఆడింది సార్ ఈ వారం’ అని చెప్పుకొస్తాడు..అంత బాగా ఆడినట్టు అయితే ఎందుకు అందరికంటే తక్కువ ఉన్నారు అని అడుగుతాడు..’నువ్వు గెలవడం కోసం కాదు..అవతలోళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసావు’ అని గీతూ తో అంటదు నాగార్జున..అప్పుడు గీతూ మాట్లాడుతూ ‘లాస్ట్ వీక్ పూలు ఎత్తే టాస్కులో ఎవ్వరు పూలు ఎత్తలేదు సార్..నేను ఉండే సీజన్లో వాళ్ళు ఆడకపోయినా మనమే ఆడిస్తాము అనే ఉద్దేశ్యం తో అలా చేశాను సార్..అందుకే అందరిని అలా రెచ్చగొట్టాను’ అని చెప్పుకొస్తుంది.

అప్పుడు నాగార్జున దానికి సమాధానం చెప్తూ ‘గేమ్ ని ఆసక్తికరంగా చెయ్యడం మా బిగ్ బాస్ చూసుకుంటాడు..ఎవరి ఆట వాళ్ళు బలంగా ఆడితే ఈ సీసన్ ఎక్కడో ఉండేది’..అప్పుడు గీతూ సమాధానం చెప్తూ ‘మెంటల్ అయిపోతుంది సార్ గేమ్ అంటే..నేను మాములుగా బయట కూడా గేమర్ ని’ అని చెప్పుకొస్తుంది గీతూ..అప్పుడు నాగార్జున దానికి బదులిస్తూ ‘అవతలోది బలహీనత మీద ఆడుకోవాలనుకోవడం అనేది గేమర్ లక్షణం కాదు..సంచలక్ గా ఉన్న నువ్వు ఎవరు ఆటలోకి రావడానికి..? నీ పని ఎవరు ఎలా ఆడుతున్నారు అని చూడడం మాత్రమే..ఈ వారం నువ్వు ఆడిన ఆట బొచ్చులో ఆటనే..ఈ వారం సంచలక్ గా నువ్వు చేసిన తప్పుకి నీకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే’ అంటూ నాగార్జున గీతూ ని బాగా తిడుతాడు.
