Bigg Boss 6 Telugu- Aadi Reddy: ప్రేక్షకులందరూ ఎంతోగానో ఎదురు చూసే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది..గడిచిన వారాలతో పోలిస్తే ఈ వారం కెప్టెన్సీ తో పాటుగా ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ టాస్కు కూడా జరిగింది..ఈ టాస్కు లో రేవంత్ ,శ్రీహాన్ మరియు ఫైమా పాల్గొనగా ఫైమా ఈ టాస్కులో గెలుపొంది ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేసుకుంది..కానీ శ్రీహాన్ మరియు రేవంత్ ఈ టాస్కులో పెట్టిన ఎఫ్ర్ట్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..హౌస్ మేట్స్ అందరూ వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఫైమా ని గెలిపించేలా చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది.

అయితే ఈ టాస్కులో ఆది రెడ్డి ఆడదానికి మొగ్గు చూపడు..అనవసరంగా ప్రైజ్ మనీ డబ్బులను ఎందుకు వాడుకోవడమని ఆయన ఈ టాస్కు నుండి తప్పుకొని ఒక మూల కూర్చుంటాడు..అలా చేసినందుకు ఈరోజు నాగార్జున ఆది రెడ్డి ని బాగా తిడుతాడు..దానికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఈ ప్రోమో లో నాగార్జున ఆది రెడ్డి తో మాట్లాడుతూ ‘ఇనాయ నీకు ఒక విషయం చెప్పింది..బిగ్ బాస్ ఆట ఇచ్చినప్పుడు ఆడాలి కానీ అడ్డమైన సాకులు చెప్పి ఆడకుండా ఉండడానికి వీలు లేదని..నీ ఫీలింగ్ ఏమిటి టాస్కు ఆడకపోవడమే టాస్క్ అనుకున్నావా..నువ్వే కానీ ఆ టాస్కు గెలిచి ఏవిక్షన్ ఫ్రీ పాస్ దక్కించుకొని ఉంటె ఒక జెన్యూన్ కంటెస్టెంట్ ని ఇంటి నుండి బయటకి వెళ్లకుండా కాపాడే అవకాశం ఉండేది.

అది సపోర్ట్ చెయ్యడం కాదా..అది ఆట తీరు కాదా..నువ్వు అలా చేస్తే జనం నిన్ను ఎంత మెచ్చుకుంటారు..ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని వేస్ట్ అంటావా..ఆ పాస్ ఎవరికీ వస్తే వాళ్లకి ఓట్లు రావా..నువ్వు ఎమన్నా పెద్ద పుడింగి అనుకుంటున్నావా ఆడియన్స్ ఏమి అనుకుంటున్నారో నువ్వు చెప్పడానికి..గేమ్ విషయం లో ఎక్కువ ఆలోచించి లూపులు వెతికితే ఏమి అవుతుందో తెలుసా’ అని తిడుతాడు నాగార్జున..అప్పుడు ఆడియో రెడ్డి దానికి సమాధానం చెప్తూ ‘సార్ నేను నిజంగా గెలిస్తే..ఆ ఏవిక్షన్ ఫ్రీ పాస్ నాకు నేను వాడుకోను కదా సార్..ఇంకా నాకు ఎందుకు అది’ అని అంటాడు..అప్పుడు నాగార్జున ‘అది నువ్వు గెలిచి చెప్పాలి..గెలవకుండా కాదు’ అని అంటాడు..ప్రస్తుతం ఈ ప్రోమో హాట్ టాపిక్ గా మారింది.
