Bigg Boss 6 Telugu Marina- Surya: ఈ వారం బిగ్ బాస్ షో ఆసక్తికరమైన టాస్కులతో ఎంతో అద్భుతంగా మరియు ఆహ్లాదకరంగా సాగింది..ఎక్కడ కూడా గొడవలకు మరియుఈ కొట్లాటలకు తావు ఇవ్వకుండా ఈ వారం గడిచిపోయింది..మాములుగా కెప్టెన్సీ టాస్కు అంటే బిగ్ బాస్ హౌస్ రణరంగం గా మారిపోతుంది..కానీ ఈసారి మాత్రం బిగ్ బాస్ చాలా చక్కగా డీల్ చేసాడు..అక్కడక్కడా శ్రీ సత్య మరియు బాలాదిత్య మధ్య చిన్న చిన్న వాగ్వివాదం..మరియు ఆది రెడ్డి – రోహిత్ మధ్య చిన్నపాటి గొడవలు..ఫైమా – సుదీప మధ్య కోల్డ్ వార్ తప్ప పెద్దగా గొడవలు ఏమి జరగలేదు.
ఇక ఈరోజు జరిగిన కెప్టెన్సీ టాస్కు లో రోహిత్ గెలుస్తాడు అని అందరూ అనుకున్నారు..ఎందుకంటే అతను ఇంటి కోసం బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్స్ వినియోగించుకోలేదు..అలాగే వాసంతి కోసం రెండు వారాలు నేరుగా నామినేట్ అయ్యాడు..కెప్టెన్సీ టాస్కులో ఆ సింపతీ తోనే ఆఖరి వరుకు నెట్టుకొచ్చాడు కానీ..చివర్లో సూర్య ఉండడం వల్ల అందరి ఓట్లు సూర్య కి పడడం తో కెప్టెన్ అయ్యే అవకాశం ని కోల్పోయాడు.
హౌస్ లో ఒక్క వాసంతి తప్ప అందరూ సూర్య కి వోట్ వెయ్యడం తో ఇక చేసేది ఏమి లేక రోహిత్ భార్య మెరీనా కూడా సూర్య కి వోట్ వేస్తుంది..ఆమె మాట్లాడుతూ ‘ఒకరు నా తమ్ముడు లాంటోడు..ఇంకోడు నా భర్త..కానీ ఒక హౌస్ మెట్ గా చెప్పాలంటే నా ఓటు సూర్య కి వేస్తున్న’ అని చెప్పడం తో రోహిత్ ఒక్కసారిగా షాక్ కి గురి అవ్వగా, మిగిలిన ఇంటి సభ్యులందరు చప్పట్లు కొట్టారు.
ఆ తర్వాత రోహిత్ ని సముదాయిస్తూ ‘నువ్వు బాగా ఆడటం లేదు అని కాదు..నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు..నీ కష్టం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎదో ఒక రోజు అర్థం అవుతుంది..ఐ లవ్ యు’ అని చెప్పుకొస్తుంది..రోహిత్ కూడా ఐ లవ్ యు టూ అని బదులిస్తాడు..ఇక ఆ తర్వాత సూర్య ప్రభాస్ వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ బాహుబలి స్టైల్ లో ప్రమాణస్వీకారం చేసి కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతారు.