Bigg Boss 6 Telugu- Inaya Sultana vs Adi Reddy: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే నామినేషన్స్ డే వచ్చేసింది..ప్రతి వారం హీట్ వాతావరణం లో సాగే నామినేషన్స్ ఈ వారం మాత్రం చాలా కూల్ గా కొనసాగింది..గత వారం లో ఇంటి నుండి డబుల్ ఎలిమినేషన్ కారణం గా బాలాదిత్య మరియు వాసంతి ఎలిమినేటైన సంగతి మన అందరికి తెలిసిందే.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయిన ఇంటి సభ్యులు శ్రీహాన్, రేవంత్ , ఆది రెడ్డి , రోహిత్ , రాజ్, ఇనాయ ,కీర్తి , శ్రీ సత్య మరియు మరీనా..వీరిలో అందరి నామినేషన్స్ సరైన పాయింట్స్ తో జరిగినప్పటికీ..ఇనాయ ఆది రెడ్డి ని నామినేట్ చేసిన విధానం మాత్రం అందరికి నవ్వు రప్పించింది..ఇనాయ మొదటి నుండి నామినేషన్స్ సిల్లీ రీజన్స్ తో నామినేట్ చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం..ఈసారి కూడా అలాంటి నామినేషన్ కి తెర లేపింది ఇనాయ.
ముందుగా ఆది రెడ్డి రోహిత్ ని నామినేట్ చేస్తూ ‘మీరు ఆరోజు టాస్కులో అలా అగ్రెస్సివ్ అవ్వడం వల్ల మా గేమ్ కూడా దెబ్బ తినింది..మీరు కాస్త కంట్రోల్ లో ఉండుంటే బాగుండేది..ఆ కోపం లో మీరు కొన్ని పదాలు కూడా వదిలేసారు’ అంటూ రోహిత్ ని నామినేట్ చేస్తాడు ఆదిరెడ్డి..రోహిత్ కూడా ఆ తప్పుని ఒప్పుకొని నామినేషన్ అంగీకరిస్తాడు..ఇక ఆ తర్వాత ఇనాయ వంతు వచ్చినప్పుడు అదే రీజన్ ని అడ్డుపెట్టుకొని ఆది రెడ్డి ని నామినేట్ చేస్తుంది..’మీరు రోహిత్ గారిని ఆ రీజన్ అడ్డుపెట్టుకొని నామినేట్ చేసారు..కానీ అదే రీజన్ వల్ల మీరు ఆరోజు టాస్కులో మైక్ పగలకొట్టడం వల్లే మన టీం ఓడిపోయింది..మీరు ఇప్పుడు చెప్పింది మీరే ఫాలో అవ్వలేదు’ అంటూ నామినేషన్ వేస్తుంది ఇనాయ.

అప్పుడు ఆది రెడ్డి మాట్లాడుతూ ‘ఆరోజు నేను చేసింది తప్పు కాబట్టే..ఆ తప్పు వల్లే జరిగిన పరిణామాలు చూసాను కాబట్టే నాలాగా మరొకరికి జరగకూడదు అనే నామినేషన్ వేసాను..అది అయిపోయిన అంకం..ఆ రీజన్ మీద నన్ను అప్పుడు అందరూ నామినేట్ చేసారు..ఇప్పుడు నువ్వు ఆ రీజన్ మీదనే నామినేట్ చేసావా తల్లి?’ అని అడుగుతాడు ఆది రెడ్డి..అప్పుడు ఇనాయ ‘అవును’ అని సమాధానం చెప్తుంది..దెబ్బకి ఆది రెడ్డి కి మైండ్ బ్లాక్ అయ్యి క్రిందపడున్న చెత్తని తన నెత్తిమీద వేసుకొని ‘దండం తల్లి..దెబ్బకి పిచ్చెక్కిపోయింది నాకు’ అని అంటాడు..ఇది చూసి మిగిలిన ఇంటి సభ్యులు కూడా నవ్వుకుంటారు.