Bigg Boss 6 Telugu- Inaya Sultana: గత కొద్ది రోజుల నుండి బిగ్ బాస్ సీజన్ 6 లో ఎవ్వరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సీజన్ లో ఎలిమినేషన్స్ మొత్తం ‘అన్ ఫెయిర్’ గా ఉంటుందని..ఆతని ఆడే వాళ్ళని మరియు కంటెంట్ ఇచ్చేవాళ్ళందరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఇంకా మేము దేనికోసం బిగ్ బాస్ చూడాలి అంటూ అంటూ ఆడియన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..పోయినవారం హౌస్ నుండి గీతూ ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది.

బిగ్ బాస్ కి లెక్కలేనంత కంటెంట్ ని ఇస్తున్న గీతూ ఎలిమినేట్ అవ్వడం ఏమిటి..అసలు ఆమె లేని ఆటని ఊహించుకోలేము అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..ఇక ఈ వారం బిగ్ బాస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులు రేవంత్, ఇనాయ సుల్తానా, వాసంతి, ఫైమా, శ్రీహాన్, కీర్తి, మరీనా,బాలాదిత్య, ఆది రెడ్డి.
వీరిలో హౌస్ మేట్స్ ఎక్కువ శాతం ఇనాయ సుల్తానా ని టార్గెట్ చేసారు..గత వారం లో కూడా ఇంటి సభ్యులు ఆమెనే టార్గెట్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈరోజు విడుదల చేసిన ప్రోమో లో ముందుగా ఆది రెడ్డి ఇనాయ ని నామినేట్ చేస్తూ ‘నువ్వు వాష్ రూమ్ లో కూర్చొని బిగ్ బాస్ తో మాట్లాడడం నాకు నచ్చలేదు ‘ అని అంటాడు..అప్పుడు ఇనాయ మాట్లాడుతూ ‘అది నాకు, బిగ్ బాస్ కి సంబంధించిన విషయం’ అని అంటుంది.

‘అయితే ఇక్కడ ఉన్న మేమందరం ఎవరు..?నీకు బిగ్ బాస్ కి మధ్య ఏమైనా సమస్యలు ఉంటె బయటకి వెళ్లి తేల్చుకోండి’ అని అంటాడు ఆదిరెడ్డి..ఆది రెడ్డి తో పాటుగా రాజ్ , ఫైమా, శ్రీ సత్య, వాసంతి ఇలా అధిక శాతం మంది ఇంటి సభ్యులు ఇనాయ ని నామినేట్ చేసారు..ఇంటి సభ్యులందరు టార్గెట్ చెయ్యడం తో ఇనాయ కి రోజు రోజుకి సోషల్ మీడియా లో సపోర్ట్ పెరిగిపోతుంది.