Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ తొలి వారం పూర్తయ్యింది. ఈ వారంలో ఎవరినీ ఎలిమినేట్ చేయకుండా బిగ్ షాక్ ఇచ్చారు. అత్పల్ప ఓట్లు సాధించినా కూడా ఇనాయా, అభినయశ్రీలను ఈ వారం ఎలిమినేట్ చేయకుండా కాపాడారు. దీంతో ఎలిమినేషన్ కోసం ఆత్రంగా ఎదుచూసిన బిగ్ బాస్ ప్రేమికులు బిగ్ షాక్ కు గురయ్యారు.

ఇక ప్రతీ సీజన్ బిగ్ బాస్ టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది. కానీ తొలి వారం గడిచినా ఈసారి బిగ్ బాస్ కు రేటింగ్ రావడం లేదట.. దీనికి ప్రధాన కారణం.. బలమైన సెలబ్రెటీలు ఈసారి బిగ్ బాస్ లో లేకపోవడమేనని అంటున్నారు. పేరున్న వారిని.. హీరోలను తీసుకోలేదని.. అంతా చోటా మోటా ముక్కు మొహం తెలియని వారిని తీసుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక బిగ్ బాస్ లాంచింగ్ ప్రోగ్రాం కూడా పేలవంగా చేశారని.. పెద్దగా పేలలేదని.. నాగార్జున హౌస్ లోకి పంపించే ప్రారంభ ఎపిసోడ్ కూడా ఆదరబాదరగా చేశారని.. ఎంటర్ టైన్ మెంట్ పంచలేదని అంటున్నారు.

ఇక నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది. బజర్ రౌండ్ అని.. పాటలు పాడించి డ్యాన్సులు చేసే టాస్క్ లు ఎప్పుడూ బిగ్ బాస్ లో జరుగుతూనే ఉంటాయని.. మళ్లీ పాత చింతకాయపచ్చడి ప్రయోగాలు చేయడం వల్లే ప్రేక్షకులకు నచ్చక చూడలేదని అంటున్నారు.
ఇక ఆసియా కప్ ఎఫెక్ట్ కూడా బిగ్ బాస్ వీక్షాకదరణ తగ్గడానికి మరో కారణం అని అంటున్నారు. ఇవన్నీ కలిపి ఈసారి బిగ్ బాస్ పై అంతగా ప్రేక్షకాదరణ లేదని.. మొదటి సారి రేటింగ్ చూసి బిగ్ బాస్ నిర్వాహకులు షాక్ అయినట్టు సమాచారం.