Homeఎంటర్టైన్మెంట్Geetu Royal Remuneration: రెమ్యునరేషన్ లో కూడా నిరాశే... 9 వారాలకు గీతూకి దక్కింది ఇంతే!

Geetu Royal Remuneration: రెమ్యునరేషన్ లో కూడా నిరాశే… 9 వారాలకు గీతూకి దక్కింది ఇంతే!

Geetu Royal Remuneration: బిగ్ బాస్ షోతో ఆర్థికంగా, ఫేమ్ పరంగా నిలదొక్కుకోవాలని గీతూ ఆశపడింది. ఆమె ఆశలు గల్లంతు అయ్యాయి. కనీసం ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయిన గీతూ ఆట మధ్యలోనే ముగిసింది. చెప్పుకోదగ్గ సెలెబ్రిటీ కానప్పటికీ గీతూ టైటిలే టార్గెట్ గా హౌస్లో అడుగుపెట్టింది. కేవలం తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అనుకుంది. టాప్ కంటెస్టెంట్ గా టైటిల్ విన్నర్ కావాలి ఆశ పడింది. గీతూ ఆలోచన చాలా వరకు సక్సెస్ అయ్యింది కూడా. డే వన్ నుండి హౌస్ లో గేమ్ ఆడిన కంటెస్టెంట్ గీతూ. అది ఆమెకు ప్లస్ అయ్యింది. షో పట్ల అవగాహన లేని కొందరు కంటెస్టెంట్స్ మొదటి రెండు వారాలు ఏ మాత్రం సీరియస్ నెస్ చూపలేదు.

Geetu Royal Remuneration
Geetu Royal

దీంతో నాగార్జున తినడానికి నిద్ర పోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారా ? అంటూ క్లాస్ పీకాడు. అదే సమయంలో గీతూని పొగిడాడు. దీంతో ఆమె హైలెట్ అయ్యింది. బిగ్ బాస్ ఆమెను నమ్మి తన చుట్టూ గేమ్ నడపడం ప్రారంభించాడు. అలా సామాన్యుల కోటాలో షోకి వెళ్లిన గీతూ టైటిల్ ఫేవరెట్ అయ్యారు. టాప్ కంటెస్టెంట్ అన్న పేరు తెచ్చుకున్నారు.

గీతూలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఆట తప్పుదోవ పట్టింది. ఇంకా బాగా ఆడుతున్నాను అనుకోని వరస్ట్ గేమ్ స్టార్ట్ చేసింది. ఆడియన్స్ లో నెగిటివిటీ మూటగట్టుకుంది. 8,9 వారాల్లో గీతూ గేమ్ గాడి తప్పింది. ఓటింగ్, రేటింగ్స్ మొత్తం మారిపోయాయి. అనూహ్యంగా ఎలిమినేటై బయటకు వచ్చేసింది. గీతూకు ఊహించని షాక్ తగిలింది. తన కలలు కోరికలు ఒక్కసారిగా కూలిపోవడంతో ధారాపాతంగా ఏడ్చేసింది. తన ఎలిమినేషన్ ఆపేస్తారేమో అని చివరి క్షణం వరకూ ఆశపడింది. కానీ నాగార్జున రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటూ బయటకు పంపి వేశారు.

Geetu Royal Remuneration
Geetu Royal

యూట్యూబర్ గా సోషల్ మీడియా సెలబ్రిటీగా హౌస్లోకి ప్రవేశించిన గీతూ రెమ్యూనరేషన్ చాలా తక్కువని తెలుస్తుంది. ఆమె వారానికి రూ. 25 వేలు ఒప్పందం పై హౌస్ కి వెళ్లారట. ఆ లెక్కన గీతూకు 9 వారాలకు కేవలం రూ. 2.25 లక్షలు అందుకున్నారట. యాభై లక్షల టార్గెట్ తో బరిలో దిగిన గీతూ అత్తెసరు డబ్బులతో సర్దుకోవాల్సి వచ్చింది. అయితే గీతూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు వారాల తర్వాత ఆమెను హౌస్లోకి పంపే అవకాశం కలదంటూ టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో ఈ తరహా ఎంట్రీలు చోటు చేసుకోగా, ఏమో జరగవచ్చు అంటున్నారు.

Naga Shaurya Took Crores Of Dowry || Naga Shaurya Marriage || Naga Shaurya Future Wife Anusha Shetty
గీతూ రాయల్ కు కలిసొచ్చిన ఎలిమినేషన్! || Bigg Boss Geethu Get Chance In Pawan Kalyan Movie || Geethu
Anushka Shetty As Vantalakka || Anushka Latest Update || Tollywood || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version