Geetu Royal vs Revanth: గడిచిన వారాలతో పోలిస్తే ఈ వారం బిగ్ బాస్ ప్రారంభం నుండే ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు దూసుకుపోతుంది..ఈ వారం నామినేషన్స్ కూడా వాడివేడిగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి ఇంటి సభ్యులందరు నామినేట్ అయ్యారు..మాములుగా కెప్టెన్ కి నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ ఉంటుంది..కానీ పోయిన వారం నుండి కెప్టెన్ ఎవ్వరు లేకపోవడం తో ఇంటి సభ్యులందరు నామినేషన్స్ లోకి వచ్చేసారు.

ఇక ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కుని చాలా ఆసక్తికరంగా మలిచాడు..చెరువులో చేపలు అనే టాస్కు ద్వారా ఇంటి సభ్యులలో అగ్గి వేసాడు బిగ్ బాస్..అందరూ బాగా ఆట లీనమై దెబ్బలు తాకినా పట్టించుకోకుండా ఆడారు..ముఖ్యంగా ఈ టాస్కులో గీతూ, రేవంత్ , రోహిత్ మరియు మెరీనా బాగా హైలైట్ అయ్యారు..గీతూ అందరికంటే తక్కువ చేపలను పట్టుకొని టాస్కు నుండి ఎలిమినేట్ అయ్యినప్పటికీ కూడా హౌస్ మేట్స్ ని రెచ్చగొట్టడం లో మాత్రం సఫలీకృతం అయ్యింది.
ఇక ఈ టాస్కులో ఇంటి సభ్యులు ఒకరి దగ్గర ఉన్న చేపలను మరొకరు లాగుకునే ప్రక్రియ లో ఫిజికల్ అయ్యింది..ముఖ్యంగా గీతూ, కీర్తిలకు అయితే గట్టిగానే దెబ్బలు తాకాయి..మూడవ రౌండ్ లో చేపలను పట్టుకునే ప్రక్రియ లో రేవంత్ గీతూ ని నెట్టివేయడం తో ఆమె క్రిందపడి కాలుకి దెబ్బ తాకడం తో ఆ కోపంలో ‘నీ అబ్బా రేయ్’ అంటూ రేవంత్ ని అంటుంది..అప్పుడు రేవంత్ ‘ఏయ్ ఏంటి వాగుతున్నావ్’ అని గీతూ మీదకి వెళ్లడం తో గీతూ ‘నా కాలుకి బలంగా దెబ్బ తాకింది’ అని గట్టిగా అరుస్తుంది.

దీనితో రేవంత్ సైలెంట్ గా వెనక్కి తిరిగి వెళ్తాడు..ఆ తర్వాత గీతూ నే రేవంత్ దగ్గరకి వెళ్లి క్షమాపణలు చెప్తుంది..’అలా నేను అని ఉండాల్సింది కాదు..కానీ నొప్పి ఎక్కువ అవ్వడం తో కోపం లో తెలీకుండా ఆ పదం వచ్చేసింది..సారీ’ అని చెప్తుంది గీతూ..రేవంత్ కూడా తన వల్ల దెబ్బ తాకినందుకు గీతూ కి క్షమాపణలు చెప్తాడు.