Bigg Boss 6 Telugu- Sri Satya: కంటెస్టెంట్ శ్రీసత్య మొదటి రెండు వారాలు ఎలాంటి గేమ్ ఆడలేదు. దీంతో హోస్ట్ నాగార్జున ఆమెకు క్లాస్ పీకడం జరిగింది. తాను మనుషులతో కలవలేను. నేను లవ్ ఫెయిల్యూర్. ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ప్రేమించినవాడు మోసం చేయడంతో డిప్రెషన్ కి గురయ్యానంటూ శ్రీసత్య హౌస్లో వివరణ ఇచ్చుకున్నారు. అయితే అర్జున్ కళ్యాణ్ ఆమెకు దగ్గర కావాలని చూశాడు. డే వన్ నుండి అదే పనిలో ఉన్నాడు. ఆమె కోసం తన గేమ్ కోల్పోయాడు. శిక్షలు కూడా అనుభవించాడు.

అర్జున్ తాగ్యాన్ని మాత్రం శ్రీసత్య ఏనాడూ గుర్తించలేదు. హోటల్ టాస్క్ లో తన వద్ద ఉన్న రూ. 500 శ్రీసత్యకు ఇచ్చేశాడు. నీకు ఫేవర్ చేయాలని నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చేశాని అర్జున్ అంటే.. నాకేమీ ఊరకే ఇవ్వలేదు,సేవలు చేయించుకొని ఇచ్చావని శ్రీసత్య కొట్టిపారేసింది. పూర్ గేమర్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ గత వారం ఎలిమినేటై వెళ్ళిపోయాడు.
హౌస్ నుండి వెళ్ళిపోతూ కూడా అర్జున్ తన ప్రేమను చాటుకున్నాడు. అసలు బిగ్ బాస్ షోకి వచ్చిందే శ్రీసత్య కోసం అన్నాడు. ఆమె బిగ్ బాస్ షోకి శ్రీసత్య సెలక్ట్ అయ్యారని తెలిసి అప్లై చేశానని అసలు విషయం బయట పెట్టాడు. గేమ్ బాగా ఆడు బయట విషయాలు నేను చూసుకుంటానని శ్రీసత్యకు హామీ ఇచ్చాడు. శ్రీసత్యకు అర్జున్ ఎంత చేసినా ఆమె దగ్గరకాలేదు. అర్జున్ ని పూర్తిగా ఇష్టపడలేదు.

దానికి ఆమె చెబుతున్నట్లు లవ్ ఫెయిల్యూర్ కారణమని అందరూ అనుకున్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే కాదనిపిస్తుంది. అల్లు అర్జున్ వెంటపడినా దూరం పెట్టిన శ్రీసత్య కంటెస్టెంట్ శ్రీహాన్ కి దగ్గరవుతున్నారనిపిస్తుంది. ముఖ్యంగా హౌస్ నుండి అర్జున్ వెళ్ళిపోయాక శ్రీసత్య శ్రీహాన్ తో ఎక్కువగా ఉంటుంది. అతడితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. చేపల చెరువు టాస్క్ కోసం బిగ్ బాస్ వీరిద్దరినీ ఒక టీం గా చేశాడు. సేకరించిన చేపలను కాపాడుకోవాలనే సాకుతో శ్రీహాన్ పక్కనే పడుకుంది. శ్రీసత్యను గమనిస్తే ఆమె శ్రీహాన్ కి దగ్గరవుతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.