Bigg Boss 6 Telugu- Adi Reddy: ఈ వారం మొత్తం బిగ్ బాస్ సీజన్ ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు నడుస్తున్న సంగతి తెలిసిందే..ఈ టాస్కులో గెలిచిన కంటెస్టెంట్ ఫినాలే వీకెండ్ కి నేరుగా చేరుకుంటారు..ఊహించని మలుపుల మధ్య ఈ టాస్కు చాలా ఆసక్తికరంగా..జనరంజకంగా సాగింది..ఈ టాస్కులో ముందుగానే శ్రీ సత్య మరియు ఇనాయ తొలగిపొయ్యారు..ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయిన కీర్తి , ఇనాయ మరియు శ్రీ సత్య కి గేమ్ లో మళ్ళీ తిరిగొచ్చే అద్భుతమైన అవకాశం ని బిగ్ బాస్ ఇవ్వగా ఆ టాస్కులో శ్రీ సత్య మరియు ఇనాయ ఓడిపోతారు..కీర్తి మళ్ళీ తిరిగి గేమ్ లోకి వస్తుంది.

ఇక తదుపరి టాస్కులో కేవలం నలుగురికి మాత్రమే కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం ఇచ్చాడు..మొత్తం మీద ఆరు మంది కంటెస్టెంట్స్ ఈ టాస్కులో ఉండగా..ఏకాభిప్రాయం తో ఇద్దరినీ తొలగించాలని బిగ్ బాస్ అంటాడు..కానీ కంటెస్టెంట్స్ అందుకు ఒప్పుకోకపోవడం తో శ్రీ సత్య మరియు ఇనాయ కి ఇద్దరినీ గేమ్ నుండి తొలగించే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్.
అలా వాళ్లిద్దరూ కీర్తి మరియు రోహిత్ ని తొలగించగా రేవంత్ , శ్రీహాన్ , ఫైమా మరియు ఆది రెడ్డి గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు..ఈ టాస్కులో ఒక్కచేతితో స్టిక్ పట్టుకొని దానిపై సంచాలక్స్ గా వ్యవహరిస్తున్న శ్రీ సత్య మరియు ఇనాయ చెప్పిన ఐటమ్స్ ని బ్యాలన్స్ చేస్తూ నిలబెట్టాలి..ఈ టాస్కులో ముందుగా ఫైమా తొలగిపోతుంది..ఆ తర్వాత రేవంత్ కూడా తొలగిపోతాడు..ఇక చివరికి ఆది రెడ్డి మరియు శ్రీహాన్ మిగులుతారు.

శ్రీహాన్ బ్యాలన్స్ చెయ్యడానికి చాలా వరుకు ప్రయత్నిస్తాడు కానీ చివరి నిమిషం లో ఐటమ్స్ అన్ని బ్యాలన్స్ తప్పిపోయి పడిపోతుంది..ఇక చివరిగా ఆది రెడ్డి మిగిలి అతను ఈ టాస్కులో గెలుపొందుతాడు..దీనితో మొదటి స్థానం లో యాడిక పాయింట్స్ తో ఆది రెడ్డి నిలబడగా, రెండవ స్థానం లో రేవంత్, మూడవ స్థానం లో శ్రీహాన్, నాల్గవ స్థానం లో ఫైమా , ఐదవ స్థానం లో కీర్తి మరియు ఆరవ స్థానం లో రోహిత్ నిలుస్తారు.